Jio Safe and Jio Translate: అందుబాటులోకి జియో సేఫ్, జియో ట్రాన్స్‌లేట్ సేవలు.. ఉపయోగం ఏంటంటే..?
Jio Safe and Jio Translate: ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇటీవల టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Jio Safe and Jio Translate: ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇటీవల టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో అన్ని ప్రధాన సంస్థలు రేట్లను పెంచగా తొలుత ప్రకటించింది మాత్రం జియోనే అని చెప్పాలి. ఇదిలా ఉంటే జియో తాజాగా యూజర్ల కోసం రెండు కొత్త సేవలను తీసుకొచ్చింది. జియో ట్రాన్స్‌లేట్, జియో సేఫ్ పేరుతో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకి ఇవి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండు సేవలను నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో పొందాల్సి ఉంటుంది. జియో సేఫ్ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.199 కాగా.. జియో ట్రాన్స్‌లేట్ ధరను రూ.99గా నిర్ణయించారు. కేవలం జియో యూజర్లే కాకుండా ఇతరులు కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే జియో యూజర్లకు వీటిని ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు జియో పేర్కొంది.
జియో సేఫ్ సేవల విషయానికొస్తే.. వాయిస్, వీడియో, కాన్ఫరెన్స్ కాలింగ్‌కు సంబంధించిన కమ్యూనికేషన్ యాప్‌గా దీనిని తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో ఐదుగురు సభ్యులు గ్రూప్ కాలింగ్‌లో మాట్లాడుకోవచ్చు. ఇందులో వాయిస్, వీడియో కాల్స్ పూర్తి సెక్యూర్ అని జియో చెబుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది జూమ్ యాప్‌లాగా పనిచేస్తుంది.
ఇక జియో ట్రాన్స్‌లేట్‌లో యూజర్లు తమకు నచ్చిన భాషలోకి కంటెంట్‌ను మార్చుకోవచ్చు. ఈ యాప్‌తో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీతో కలిపి మొత్తం 12 భాషలకు సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కాల్‌లో ఉంటూనే ఆడియోను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు మీ మాతృభాషలో సంభాషిస్తూనే అవతలి వారికి వారి భాషలో తెలపొచ్చు. ఇన్‌స్టంట్ వాయిస్ ట్రాన్సలేట్ ఆప్షన్ ఇందులో ఉంది.