Redmi 12: రూ. 18 వేల ఫోన్‌ రూ. 11,500కే... 5జీ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. !

Redmi 12: ప్రస్తుతం 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వేగమైన ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకునే క్రమంలో వినియోగదారులు 5జీకి అప్‌డేట్ అవుతున్నారు.

Update: 2024-07-04 09:58 GMT

Redmi 12: రూ. 18 వేల ఫోన్‌ రూ. 11,500కే... 5జీ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. !

Redmi 12: ప్రస్తుతం 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వేగమైన ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకునే క్రమంలో వినియోగదారులు 5జీకి అప్‌డేట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే 5జీ ఫోన్‌ల ధరలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఈ కామర్స్ సంస్థలు సైతం 5జీ ఫోన్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెడ్‌మీ 12పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో రెడ్‌మీ 12 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్‌మీ 12 స్మార్ట్‌ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 17,999గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో 30 శాతం డిస్కౌంట్‌తో రూ. 12,499కే లభిస్తోంది. అయితే అదనంగా రూ. 1000 కూపన్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌ను సులభమైన ఈఎమ్‌ఐతో సొంతం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. దీంతో ఈ ఫోన్‌ను నెలకు కేవలం రూ. 697 ఈఎమ్‌ఐ చెల్లించి సొంతం చేసుకోవచ్చు. కాగా డిస్కౌంట్‌ ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 11,800 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఒకవేళ మీ పాత ఫోన్‌ను గరిష్టంగా ఎక్స్ఛేంజ్‌ లభిస్తే ఈ ఫోన్‌ను మీరు రూ. 699కే సొంతం చేసుకోవచ్చు.

ఇక రెడ్‌ మీ12 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. ఇందులో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను. 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందంచారు. 22.5 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటిగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 

Tags:    

Similar News