Tecno Spark 20 Pro: అచ్చంగా ఐఫోన్‌ను పోలిన డిజైన్.. ధర మాత్రం రూ. 20 వేలలోపే..
Tecno Spark 20 Pro: అచ్చంగా ఐఫోన్‌ను పోలిన డిజైన్.. ధర మాత్రం రూ. 20 వేలలోపే..
Tecno Spark 20 Pro: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో ఇటీవల భారతమార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నో నుంచి కొత్త ఫోన్ వస్తోంది. టెక్నో స్పార్క్ 20 ప్రో పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
టెక్నో స్కార్ 20 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారు. జులై 9వ తేదీన భారత మార్కెట్లోకి ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. పీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఇక కెమెరాకు ఈ ఫోన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.
అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు పంచ్ హోల్ సెటప్‌తో ఈ కెమెరా రానుంది. ఇక ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చిన ఈ కెమరాను అచ్చంగా ఐఫోన్ పోలిన డిజైన్‌తో ఇచ్చారు. ఇదే ఫోన్‌కి రిచ్ లుక్‌ని ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ ఫోన్‌లో శక్తివంతమైన డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు.
ఆ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో 33 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యటరీని అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఐపీ53 రేటింగ్‌తో కూడిన వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సెటప్‌ను అందించనున్నారు.