infinix: ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే..?
infinix: ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే
infinix: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అయితే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ. నెట్టింట మాత్రం కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌ఫినిక్స్ 40 ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఆన్‌లైన్‌లో లీక్ అయిన సమాచారం మేరకు ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. అమోఎల్‌ఈడీ డిస్‌ప్ఏత 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ MediaTek Helio G99 అల్టిమేట్ చిప్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని సమాఆచరం. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ లైటింగ్ రింగ్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14లో రన్ అవుతుందని తెలుస్తోంది. కంపెనీ రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు,మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందించనున్నారు. ఈ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. అలాగే 20 వాట్స్ వైర్‌లెస్ మ్యాగ్ ఛార్జ్ టెక్నాలజీని ఇవ్వనున్నారని సమాచారం.
కేవలం నిమిషాల ఛార్జింగ్‌కు 5.7 గంటల కాలింగ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో జేబీఎల్ స్పీకర్‌లు, IP54 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కోసం NFC సపోర్ట్ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇక కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.