AI: ఏఐ రంగలో దూసుకొస్తున్న అమెజాన్‌.. చాట్‌ జీపీటీకి పోటీగా..!

AI: ఏఐ రంగలో దూసుకొస్తున్న అమెజాన్‌.. చాట్‌ జీపీటీకి పోటీగా

Update: 2024-06-29 10:30 GMT

AI: ఏఐ రంగలో దూసుకొస్తున్న అమెజాన్‌.. చాట్‌ జీపీటీకి పోటీగా 

 AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ప్రతీ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం అనివార్యంగా మారింది. ఈకామర్స్‌ సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు చాట్‌బాట్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏఐ అనగానే చాలా మందికి ఓపెన్‌ఐ చాట్‌ జీపీటీ గుర్తొస్తుంది.

అయితే ఈ చాట్‌బాట్‌కు పోటీగా అమెజాన్‌ కొత్త చాట్‌బాట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మేటిస్‌ పేరుతో ఏఐ లాంచ్‌ చేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టైటాన్‌ ఏఐ మోడల్‌ కంటే ఆధునికంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చాట్‌ బాట్ ద్వారా యూజర్లు టెక్స్ట్, ఇమేజ్ బేస్డ్ సమాధానాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ చాట్‌బాట్‌ ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలెజిన్స్‌ వెనుకంజలో ఉన్న అమెజాన్‌ ఈ రంగంలో తనదైన ముంద్ర వేసేందుకు మేటిస్‌ ఏఐ తీసుకొస్తోంది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న మేటిస్‌ ఏఐను 2024 సెప్టెంబర్‌ లాంచ్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు అమెజాన్‌ ఈ లాంచ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. అమెజాన్‌ నిర్వహించే అలెక్సా ఈవెంట్‌లో అమెజాన్ మేటిస్ లాంచ్ చేస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. 

Tags:    

Similar News