Vivo T3 Lite: మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌.. రూ. 10వేలలోనే 5జీ సపోర్ట్‌తో..!

Vivo T3 Lite: కొత్తగా 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్‌లో ఉన్న వారికి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో గుడ్ న్యూస్‌ చెప్పింది.

Update: 2024-06-28 15:30 GMT

Vivo T3 Lite: మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌.. రూ. 10వేలలోనే 5జీ సపోర్ట్‌తో..!

Vivo T3 Lite: కొత్తగా 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్‌లో ఉన్న వారికి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో గుడ్ న్యూస్‌ చెప్పింది. తక్కువ ధరలోనే 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసే ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 10వేల బడ్జెట్‌లో మంచి 5జీ ఫోన్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వివో టీ3 లైట్ పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లోకి లాంచ్‌ చేశారు. అయితే తొలి సేల్ మాత్రం జులై 4వ తేదీన తొలి సేల్‌ ప్రారంభంకానుంది.

ఈ ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,499గా ఉండగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,499గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ను రూ. 10 వేలకు సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వివో టీ3 లైట్‌ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడి స్క్రీను అందించారు.1,612 x 720 పిక్సెల్స్‌ రిజల్యూజన్‌, 90Hz రిఫ్రెష్ రేట్, 840nits బ్రైట్‌నెస్ ఈ ఫోన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. అలాగే సెక్యూరిటీ పరంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 

Tags:    

Similar News