Motorola Razr 50 Ultra: మోటో నుంచి లక్ష రూపాయల ఫోన్‌.. ఫీచర్స్‌ అలా ఉంటాయి మరి..!

Motorola Razr 50 Ultra: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-05 12:30 GMT

Motorola Razr 50 Ultra: మోటో నుంచి లక్ష రూపాయల ఫోన్‌.. ఫీచర్స్‌ అలా ఉంటాయి మరి..!

Motorola Razr 50 Ultra: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్‌, మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన మోటో తాజాగా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా పేరుతో ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా రేజర్‌లో 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌లో 6.9 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎ్‌టీపీఓ ఇన్నర్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక కవర్ డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 4 ఇంచెస్‌తో కూడిన ఎల్టీపీఓ పోలెడ్ ప్యానెల్ డిస్ ప్లేను ఇచ్చారు. హెచ్డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు.కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్ కెమెరాను అదించారు. ఇన్నర్‌ డిస్‌ప్లేలో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

కెమెరాలో ప్రత్యేకంగా యాక్షన్ ఇంజన్, ఆటో స్మైల్ క్యాప్చర్, గెశ్చర్ క్యాప్చర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, సాఫ్ట్ వేర్ బేస్డ్ ఫేస్ అన్ లాక్ ఫీచర్‌ను ఇచ్చారు.

ఇక బ్యాటరీ ఇషయానికొస్తే ఇందులో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్, 5వాట్ల రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ధర పరంగా చూస్తే.. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 99,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 5000 డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 5000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. 

Tags:    

Similar News