Smartphones Under 15000: రూ.15వేల లోపు అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే

Smartphones Under 15000: రూ.15,000 కంటే తక్కువ ధర కలిగి.. అద్భుతమైన కెమెరా ఫీచర్ వంటి 'కాక్స్ హెడ్' వంటి 5 గొప్ప స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-11-17 16:19 GMT

Smartphones Under 15000

Smartphones Under 15000: మీరు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే. రూ.15,000 కంటే తక్కువ ధర కలిగి.. అద్భుతమైన కెమెరా ఫీచర్ వంటి 'కాక్స్ హెడ్' వంటి 5 గొప్ప స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రత్యేక ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు ఏవో చూద్దాం. 'కాక్స్ హెడ్' ఫీచర్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS). ఇది కెమెరాలో ఉన్న గొప్ప ఫీచర్. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌తో ఫోటో తీస్తున్నప్పుడు చేయి కదిలినా ఫోటో చెడిపోదు. ఇప్పుడు 'కాక్స్ హెడ్' లాంటి ఫీచర్ అని ఎందుకు పిలుస్తున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది?. కోడి ఎంత వేగంగా కదిలినప్పటికీ, దాని మెడ మాత్రం అంతే స్టేబుల్‌గా ఉంటుంది. అందుకే కెమెరా మూమెంట్స్ ఎంత కదిలినప్పటికీ, ఏ మాత్రం షేకింగ్ లేకుండా ఫోటోలు తీయగలిగే ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని కాక్స్ హెడ్ అని పిలుస్తున్నారు.

అదేవిధంగా ఫోన్‌లో ఓఐఎస్ ఫీచర్ ఉంటే, ఫోటో తీసేటప్పుడు ఒకవేళ చేయి కదిలినా ఆ ఫోటో చెడిపోదు. ఈ కారణంగా, దీనిని 'కాక్స్ హెడ్' ఫీచర్‌‌గా పరిగణిస్తున్నారు. రూ. 15,000 కంటే తక్కువ ధరకే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కెమెరా ఉన్న ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

మోటరోలా వన్ విజన్

మోటరోలా వన్ విజన్ ఫోన్ కెమెరా OISతో టెక్నాలజీ సాయంతో రూపొందించారు. ఇది 48 మెగాపిక్సెల్స్ , 5 మెగాపిక్సెల్‌ల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో రూపొందించారు. ఫోన్ 4GB RAM తో వస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.10,490.

శాంసంగ్ గెలాక్సీ F 34

శాంసంగ్ గెలాక్సీ F 34 ఫోన్ కెమెరాలో కూడా OIS సెన్సార్ ఇన్‌స్టాల్ చేశారు. ఫోన్‌ వెనుక భాగంలో 50MP కెమెరా, ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ మోడల్ ఫోన్లలో 6GB వేరియంట్ మోడల్ ధర రూ.12,999 గా ఉంది.

రియల్‌మీ 13 5G

రియల్‌మీ 13 5G ఫోన్ కూడా OIS సెన్సార్ కెమెరాతో వస్తోంది. ఈ రియల్ మీ ఫోన్‌లో 50MP, 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది కాకుండా, ఫోన్‌లో సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్‌ను రూ. 14,493కి కొనుగోలు చేయవచ్చు.

హెచ్ టీసీ వన్ ఎక్స్9

OIS ఫీచర్‌ హెచ్ టీసీ వన్ ఎక్స్9లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13MP డ్యూయల్ కెమెరా ఉంది. ఇదే కాకుండా, 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ.14,770 గా ఉంది.

మోటో G64

మీరు మోటో G64 ను 15 వేల కంటే తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో OIS కెమెరా సెన్సార్ కూడా ఉంది. వెనుక కెమెరా సెటప్‌లో 50MP, 8 MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ మోటరోలా ఫోన్ ధర రూ.13,999 గా ఉంది.

Tags:    

Similar News