POCO X7- X7 Pro 5G Launch Date: పోకో నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. లాంచ్ ఎప్పుడంటే?

POCO X7- X7 Pro 5G Launch Date: POCO తన X7- X7 Pro 5Gను ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది.

Update: 2024-12-31 08:37 GMT

POCO X7- X7 Pro 5G Launch Date: పోకో నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. లాంచ్ ఎప్పుడంటే?

POCO X7- X7 Pro 5G Launch Date: POCO తన X7- X7 Pro 5Gను ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లు. గొప్ప డిజైన్‌తో వస్తాయి. వాటి స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లను చూద్దాం.ఈ స్మార్ట్‌ఫోన్‌లలో డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వేగన్ లెదర్ ఫినిషింగ్, ఎల్లో, బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లలో మరో రెండు కలర్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. రెండు మోడల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP వెనుక కెమెరాను కలిగి ఉన్నాయి.

POCO X7 Features

ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5K OLED, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7300 అల్ట్రా (4nm) ప్రాసెసర్, 8జీబీ/12.జీబీ ర్యామ్, 256జీబీ/512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే దీనిలో 50MP మెయిన్ కెమెరా (OISతో), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా,  20MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ కోసం 5110mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇతర ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, IP68 రేటింగ్ ఉన్నాయి.

POCO X7 Pro Features

ఈ స్మార్ట్‌ఫొన్ 6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 nits పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా (4nm) ఉన్నాయి. 8జీబీ/12జీబీ ర్యామ్, 256జీబీ/512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP మెయిన్ కెమెరా (f/1.5 ఎపర్చరుతో, OIS, EIS), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా,  20MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

వీడియో రికార్డింగ్ కోసం 4K 60fps ఉంది. పవర్ కోసం 6000mAh బ్యాటరీ,  90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇతర ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, IP68 రేటింగ్ ఉంది.  POCO X7 Pro జనవరి 2న రెడ్‌మి టర్బో 4గా చైనాలో విడుదల కానుంది.

Tags:    

Similar News