iPhone SE 4 Launch: ఆపిల్ iPhone SE 4 ఆగయా.. హైప్ పెంచేస్తున్న లీక్స్..!

iPhone SE 4 Launch: ఆపిల్ 2025 మొదటి త్రైమాసికంలో దాని బడ్జెట్ ఐఫోన్‌ను విడుదల చేయనుంది.

Update: 2024-11-18 04:32 GMT

iPhone SE 4 Launch: ఆపిల్ ఐఫోన్  SE 4 ఆగయా..  హైప్ పెంచేస్తున్న లీక్స్..!

iPhone SE 4 Launch: ఆపిల్ 2025 మొదటి త్రైమాసికంలో దాని బడ్జెట్ ఐఫోన్‌ను విడుదల చేయనుంది. బ్రాండ్ దాదాపు 3 సంవత్సరాల తర్వాత దాని iPhone SE సిరీస్‌ను ఒక పెద్ద అప్‌గ్రేడ్‌తో అప్‌డేట్ చేయబోతోంది. గత కొన్ని నెలలుగా iPhone SE 4 గురించిన అనేక లీక్‌లు, రూమర్‌లు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి.

నివేదికలు డిసెంబరు నాటికి ఫోన్ పెద్ద-స్థాయి తయారీ ప్రారంభమవుతుందని సూచిస్తున్నాయి. అందువల్ల లాంచ్ చాలా దూరంలో లేదు. iPhone SE 4ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఊహించిన అప్‌గ్రేడ్, కొత్త ఫీచర్లు, డిజైన్, ముఖ్యంగా Apple ఇంటెలిజెన్స్, ఇంటిగ్రేషన్ వంటి అన్ని వివరాలను చూడవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone SE 4 అధికారిక ప్రారంభ తేదీ కోసం వేచి ఉండాల్సి ఉంది. ఇంతలో ఓ టిప్‌స్టర్ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ను మార్చి లేదా ఏప్రిల్ 2025లో లాంచ్ చేయాలని సూచిస్తుంది. ఐఫోన్ SE 4 కెమెరా మాడ్యూల్ పెద్ద-స్థాయి అభివృద్ధి డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఆపిల్ అభివృద్ధిని ప్రారంభించినట్లయితే లీక్ అయిన టైమ్‌లైన్ నిజంగా నిజం కావచ్చు.

స్పెసిఫికేషన్‌లు, అప్‌గ్రేడ్‌ల పరంగా, iPhone SE 4లో పెద్ద అప్‌గ్రేడ్‌లు చూడొచ్చు. ముందుగా స్మార్ట్‌ఫోన్ 6.06-అంగుళాల పెద్ద స్క్రీన్, కొత్త ఐఫోన్ 14 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది ఒకే వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు, ఇది SE సిరీస్ డిజైన్ ప్రొఫైల్‌ను అనుసరిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ ఫేస్ ఐడి ఫీచర్‌తో ఎల్‌సిడి ఒఎల్‌ఇడి డిస్‌ప్లేకి అప్‌గ్రేడ్ అవుతుందని కూడా భావిస్తున్నారు. ఆపిల్ iPhone SE 4 కోసం 8GB RAMతో A18 చిప్‌ని ఉపయోగించవచ్చు. ఇది లేటెస్ట్ జనరేషన్ చిప్, అలానే మరిన్నో ర్యామ్‌లతో వస్తుందని టాక్ వినిపిస్తుంది.

కాబట్టి  ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఇది అత్యంత సరసమైన AI-ఆధారిత ఐఫోన్‌గా మారచ్చు.ఆపిల్ దాని మునుపటి మోడల్‌లతో పోలిస్తే దాని సరసమైన ఐఫోన్ ధరలను పెంచాలని యోచిస్తోంది. iPhone SE 3 ధర రూ. 43,900, ఐఫోన్ SE 4 ధర రూ. 50,000 వరకు ఉండచ్చు. 

Tags:    

Similar News