Limited Offer: లిమిటెడ్ ఆఫర్.. వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!
Limited Offer: ప్రముఖ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE4 5Gని ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది.
Limited Offer: ప్రముఖ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE4 5Gని ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది. మీరు చౌకైన ధరలో OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే బ్రాండ్ ఏప్రిల్ నెలలో ప్రారంభించిన OnePlus Nord CE4 5Gపై రూ. 3,000 తగ్గింపును అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఖరీదైన ఇయర్‌బడ్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంది. కాబట్టీ మీరు త్వరగా ఈ మొబైల్‌ని కొనుగోలు చేయండి.
వన్‌ప్లస్ నార్డ్ CE4 5G రెండు వేరియంట్లలో వస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ ఆఫర్‌తో కూడిన బేస్ మోడల్ ధర రూ. 21,999. 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 23,999. మీరు ICICI, వన్ కార్డ్ ద్వారా చెల్లిస్తే ఈ రెండు వేరియంట్‌లకు రూ. 2000 ఫ్లాట్ ఆఫర్ రూ. 1000 బ్యాంక్ ఆఫర్ లభిస్తాయి. లాంచ్ సమయంలో రెండు మోడళ్ల ధర రూ.24,999. రూ.26,999.
అలాగే మీరు ఈ ఫోన్‌ని EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనిపై మీరు రూ.19,250 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందచ్చు. ఈ OnePlus ఫోన్ డార్క్ క్రోమ్, సెలాడాన్ మార్బుల్ అనే రెండు కలర్స్‌లో వస్తుంది. ఈ ఫోన్‌తో OnePlus Buds 2rని పూర్తిగా ఉచితంగా పొందుతారు.
OnePlus Nord CE4 5G Features
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 5జీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మెరుగైన పనితీరు, ప్రాసెసింగ్ కోసం క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్టోరేజ్ గురించి మాట్లాడితే ఫోన్ 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌తో వస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP Sony LYT600 మెయిన్ సెన్సార్, వెనుక ప్యానెల్‌లో 8MP అల్ట్రా-వైడ్ IMX355 లెన్స్ ఉన్నాయి. దానితో పాటు, అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే ఫోన్ భారీ 5500 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.