Smart TV Offers: కొత్తేడాదికి కొత్త టీవీ ప్లాన్‌ చేస్తున్నారా? రూ. 20 వేలలో బెస్ట్ టీవీల ఆఫర్స్

Update: 2024-12-22 10:19 GMT

Smart TV Offers on New Year 2025 Arrival: కొత్తేడాదికి వెల్‌కం చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. దీంతో న్యూఇయర్‌లో జీవితంలో పలు మార్పులు చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు. ఇందుకోసం న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌ కోసం ప్లాన్సింగ్స్ చేసుకుంటున్నారు. అలాగే మరికొందరు కొత్తేడాదిలో ఇంట్లోకి కొత్త ఎలక్ట్రానిక్స్, ఇతర గ్యాడ్జెట్స్‌ను తెచ్చుకునేందుకే సన్నాహాలు చేస్తుంటారు. మీరు కూడా ఈ ఏడాది కొత్త స్మార్ట్‌ టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే రూ. 20 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్‌ టీవీలు ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* ఒనిడా ఫుల్‌ హెచ్‌డీ స్మార్ట్‌ టీవీ 43ACF

ఈ స్మార్ట్‌ టీవీని రూ. 17,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే కొన్ని సెలెక్టెడ్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ 43 ఇంచెస్‌తో స్క్రీన్‌లో 1920 x 1080 పిక్సెల్‌లతో కూడిన Full HD రిజల్యూషన్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ కోసం ఇందులో 2 HDMI, ఒక USB పోర్ట్‌ను అందించారు. అలాగే సరౌండ్‌ సౌండ్‌ కోసం 20 వాట్స్‌ ఆడియో ఔట్‌‌పుట్‌ను ఇచ్చారు. ఈ టీవీపై కంపెనీ ఏడాది వారంటీ ఇస్తోంది.

* Acer I ప్రో సిరీస్ ఫుల్‌ హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ

రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్‌ టీవీల్లో ఇదీ ఒకటి. ఈ టీవీలో ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్, 2 HDMI పోర్ట్‌లు, 1 USB పోర్ట్‌ను అందించారు. అలాగే ఇందులో డాల్బీ ఆడియోకు సపోర్ట్‌ చేసే 30 వాట్స్‌ అవుట్‌‌పుట్ సౌండ్‌ను ఇచ్చారు. ఈ టీవీ ధర విషయానికొస్తే రూ. 16,999కి లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ సైతం లభిస్తోంది.

* Hisense E43N సిరీస్ ఫుల్‌ హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ ఎల్‌ఈడీ టీవీ

తక్కువ ధరలో 43 ఇంచెస్‌ టీవీకోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో 1920X1080 రిజల్యూషన్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. 30 వాట్స్‌ డాల్బీ ఆడియో అవుట్‌పుట్‌ ఈ టీవీ సొంతం. కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, 2 USB, 1 HDMI పోర్ట్‌లను అందించారు. ఈ టీవీపై ఏడాది వారంటీ అందించారు. అమెజాన్‌లో 43 శాతం డిస్కౌంట్‌తో ఈ టీవీ రూ. 19,999కి లభిస్తోంది.

Tags:    

Similar News