OnePlus Ace 5: వన్‌ప్లస్ నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. డిసెంబర్ 26న లాంచ్

Update: 2024-12-19 15:15 GMT

OnePlus Ace 5: వన్‌ప్లస్ తన Ace 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 26న చైనాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Ace 5 సిరీస్‌లో రెండు మోడల్స్ ఉంటాయి. అందులో ఒకటి Ace 5 కాగా మరొకటి Ace 5 Pro. వన్‌ప్లస్ 13 సిరీస్‌లో OnePlus 13, 13R వంటి మోడల్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ Ace 5 13R కొద్దిగా టోన్-డౌన్ వెర్షన్ కావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే Ace 5 Pro, అంతకంటే ముందుగా వచ్చిన Ace 3 Pro వలె చైనాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ Ace 5 సిరీస్ ఐదు వేరియంట్స్‌లో వస్తోంది. ఇందులో 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB మోడల్స్ ఉంటాయి. వన్‌ప్లస్ ఏస్ 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. అందులో గ్రావిటేషనల్ టైటానియం, ఫుల్ స్పీడ్ బ్లాక్, సెలెస్టియల్ పోర్సిలైన్ వంటి వేరియంట్స్ ఉన్నాయి. అయితే OnePlus Ace 5 Pro మూన్ వైట్ పింగాణీ, సబ్‌మెరైన్ బ్లాక్, స్టార్రీ పర్పుల్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పింగాణీ వెర్షన్లలో సిరామిక్ బ్యాక్ ప్యానెల్స్ ఉంటాయి. ఇతర షేడ్స్ గ్లాస్ బ్యాక్‌లను కలిగి ఉంటాయి.

ఒన్‌ప్లస్ ఏస్ 5, ఏస్ 5 ప్రో స్పెసిఫికేషన్స్ 

ఫోటోగ్రఫీ కోసం Ace 5 Proలో వెనుక భాగంలో OIS మద్దతుతో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో లెన్స్ కెమెరా ఉన్నాయి. Ace 5 Pro 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6,100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రాసెసర్ విషయానికొస్తే... OnePlus Ace 5 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 తో ఉంటుంది. ఏస్ 5 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

Tags:    

Similar News