Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు సర్‌ప్రైజ్‌.. ఇకపై వాటికి కూడా ఆ ఆప్షన్‌

Whatsapp View Once Feature: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-18 15:48 GMT

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు సర్‌ప్రైజ్‌.. ఇకపై వాటికి కూడా ఆ ఆప్షన్‌

Whatsapp View Once Feature: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫీచర్‌.? దాని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌ గతంలో వ్యూ వన్స్‌ పేరుతో ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో ఎదుటి వ్యక్తులకు పంపించిన ఫొటోలు, వీడియోలను ఒకేసారి చూసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ ద్వారా సెన్సిటివ్‌ సమాచారం అందించేటప్పుడు అదనపు గోప్యత అందించారు. అయితే తాజాగా ఈ ఫీచర్‌ను వాయిస్‌ మెసేజ్‌లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

వ్యూ వన్స్‌ వాయిస్‌ మెసేజ్‌ను ఎలా పంపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా వాట్సాప్‌ చాట్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం టెక్ట్స్‌ బాక్స్‌ పక్కన కనిపించే మైక్రో ఫోన్‌ బటన్‌ను ప్రెస్‌ చేసి హోల్డ్‌ చేయాలి. అనంతరం పైకి స్లయిడ్‌ చేసి లాక్‌ చేయాలి. వాయిస్‌ రికార్డ్‌ అయిన తర్వాత 'వ్యూ వన్స్‌' ఐకాన్‌పై ట్యాప్‌ చేయాలి. అనంతరం సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఈ ఫీచర్‌తో యూజర్లకు సెక్యూరిటీ అందిస్తుంది.

అలాగే క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు లాంటి సున్నితమైన సమాచారాన్ని షేర్‌ చేసేటప్పుడు కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. వ్యూ వన్స్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకొని ఆడియోను పంపిస్తే ఒక్కసారి మాత్రమే వినగలుగుతారు. తర్వాత అది ఆటోమేటిక్‌గా డిలీట్‌ అవుతుంది. పైగా, వాట్సాప్‌ ఈ మెసేజ్‌లకు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కల్పిస్తుంది. దీంతో మీ డేటాను మూడో వ్యక్తి చూడడం అసాధ్యం.

Tags:    

Similar News