Lenovo Yoga Slim 7i Aura Edition: లెనోవో ఆరా ల్యాప్‌టాప్.. AI ఫీచర్లతో దుమ్మురేపుతుంది..!
మీరు కొత్త ల్యాప్‌టాప్‌ని కొనాలను కుంటున్నారా? అయితే మీకు శుభవార్త ఉంది.
Lenovo Yoga Slim 7i Aura Edition: మీరు కొత్త ల్యాప్‌టాప్‌ని కొనాలను కుంటున్నారా? అయితే మీకు శుభవార్త ఉంది. దిగ్గజ కంపెనీ లెనోవో తన కొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. లెనోవో కొత్త ల్యాప్‌టాప్ Lenovo Yoga Slim 7i Aura Edition. దాని పనితీరును పెంచడానికి, కంపెనీ దానిలో లూనార్ లేక్ అనే కొత్త ప్రాసెసర్‌ను ఉపయోగించింది. లెనోవో పవర్ ఫుల్ ఫీచర్లతో దీన్ని పరిచయం చేసింది. ఇందులో మీరు 1TB వరకు స్టోరేజ్ ఉంటుంది.
కంపెనీ కొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్‌తో లెనోవా యోగా స్లిమ్ 7ఐ ఆరా ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు మద్దతిచ్చే ప్రత్యేక న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది సర్టిఫైడ్ చేసిన మైక్రోసాఫ్ట్ కో-పైలట్ ప్లస్ మీరు ప్రీమియం ల్యాప్‌టాప్ కావాలనుకుంటే, Lenovo Yoga Slim 7i మీకు ఉత్తమ ఎంపిక. ఇందులో మీకు చాలా బలమైన ప్రాసెసర్ ఇచ్చారు.
రూ.1,49,990 ధరకు కంపెనీ దీనిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మీకు సింగిల్ లూనార్ గ్రే కలర్ ఆప్షన్ లభిస్తుంది. మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే Lenovo అధికారిక వెబ్‌సైట్, ప్రత్యేకమైన స్టోర్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. లెనోవో యోగా స్లిమ్ 7i లాంచ్ ఆఫర్‌తో కంపెనీ కస్టమర్లకు గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ల్యాప్‌టాప్ కొనుగోలుపై మీరు 2 నెలల పాటు Adobe Creative Cloud ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. కస్టమర్ల సౌలభ్యం కోసం కంపెనీ కస్టమ్ టు ఆర్డర్‌ను కూడా అమలు చేసింది.
Lenovo Yoga Slim 7i Features
Lenovo యోగా స్లిమ్ 7i ఆరా ఎడిషన్‌లో, మీరు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇచ్చే 2.8K రిజల్యూషన్ డిస్‌ప్లేను పొందుతారు. డిస్‌ప్లే గరిష్ట ప్రకాశం 500 నిట్‌లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో మీరు గరిష్టంగా 32GB RAM+ 1TB స్టోరేజ్ పొందుతారు. దీన్ని పవర్ చేయడానికి, 4-సెల్ 70Whr బ్యాటరీకి సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 7, బ్లూటూత్ 5.4, Thunderbolt 4 పోర్ట్‌తో అందించారు.
లెనోవా యోగా స్లిమ్ 7ఐ ఆరా ఎడిషన్‌కు సంబంధించిన అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇది స్మార్ట్ మోడ్ ఫీచర్‌లతో వస్తుంది. పని భారాన్ని బట్టి ఈ ల్యాప్‌టాప్ దానంతటఅది అడ్జస్ట్ అవుతుంది. దీనిలో, వినియోగదారులు అనవసరమైన వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడానికి పనిచేసే అటెన్షన్ మోడ్ ఫీచర్‌ను పొందుతారు. ఇందులో కంపెనీ ఐ వెల్‌నెస్ ఫీచర్‌ను కూడా ఇచ్చింది. ఇందులో, వీడియో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసే ఆప్షన్ కూడా మీకు ఇచ్చారు.