Cyber Crime: ఇండియన్‌ పోస్ట్‌ పేరుతో ఇలాంటి లింక్స్‌ వస్తున్నాయా? క్లిక్‌ చేశారో అంతే..!

India Post Free Gifts Scam: ప్రస్తుతం సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో, కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారు.

Update: 2024-12-24 06:30 GMT

Cyber Crime: ఇండియన్‌ పోస్ట్‌ పేరుతో ఇలాంటి లింక్స్‌ వస్తున్నాయా? క్లిక్‌ చేశారో అంతే..!

India Post Free Gifts Scam: ప్రస్తుతం సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో, కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాలో డబ్బులను కాజేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు సైతం అలర్ట్‌ అవుతున్నాయి. ప్రజల్లో ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల పెరుగుతోన్న డిజిటల్‌ అరెస్ట్‌కు సంబంధించిన నేరాలపై కాలర్‌ ట్యూన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి ఓ కొత్త మోసమే వెలుగులోకి వచ్చింది. ఇండియన్‌ పోస్ట్ పేరుతో జరుగుతోన్న ఈ మోసానికి సంబంధించిన వివరాలను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఎక్స్ వేదికగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇండియన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ 170వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు బహుమతులు అందిస్తోంది అంటూ ఓ లింక్‌ను పంపిస్తున్నారు. ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలను ఎంటర్‌ చేయాలని సదరు లింక్‌లో పేర్కొంటున్నారు. పొరపాటున ఆ లింక్‌ క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే సంగతులు.

దీనిద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదే విషయమై పీఐబీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇది పూర్తి స్కామ్‌ అని, ఈ ప్రకటనకు ఇండియన్‌ పోస్టాఫీస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. PIB ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో చేసిన పోస్టులో అలాంటి లింక్‌లను క్లిక్‌ చేయకూడదని ప్రజలను అప్రమత్తం చేసింది. దేశంలో సైబర్‌ నేరాలు పెరుగుతోన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే..

ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ ఉపయోగించే సమయంలో ఉచితంగా లభించే వైఫైల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వైఫైకి కనెక్ట్‌ అవ్వకూడదు. పబ్లిక్‌ వైఫై ద్వారా హ్యాకర్లు ఫోన్‌లను టార్గెట్‌ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులను పిన్నులను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. వాట్సాప్‌లకు వచ్చే అనుమానాదస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సమయంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కామర్స్‌ సైట్స్‌కి సంబంధించి అధికారిక వెబ్‌సైట్స్‌లోనే షాపింగ్ చేయాలి.


Tags:    

Similar News