Flight: విమానంలో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతి ఉండదు.. అవేంటంటే..?
Flight: ఒకప్పుడు విమాన ప్రయాణం కేవలం కొందిరికి మాత్రమే అందుబాటులో ఉండే విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం విమాన టికెట్లు అందుబాటులోకి రావడంతో మధ్య తరగతి వాళ్లు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు.
Flight: ఒకప్పుడు విమాన ప్రయాణం కేవలం కొందిరికి మాత్రమే అందుబాటులో ఉండే విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం విమాన టికెట్లు అందుబాటులోకి రావడంతో మధ్య తరగతి వాళ్లు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో విమాన ప్రయాణానికి సంబంధించిన నిబంధనల గురించి ప్రతీ ఒక్కరికీ అవగాన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను వెంట తీసుకురాకూడదని నిబంధనలు చెబుతున్నారు. ఇంతకీ ఆ గ్యాడ్జెట్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విమాన ప్రయాణంలో భద్రతా చాలా ముఖ్యంగా. భూమికి కొన్ని వందల అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే సమయంలో ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతుంటారు. అందుకే నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంటారు. వీటిలో ప్రధానంగా గన్స్, నిషేధిత వస్తువులు లాంటివి ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను సైతం అనుమతించరు. అవేంటంటే..
* విమానంలోకి నిషేధించిన వస్తువుల్లో ఇ సిగరెట్ ఒకటి. వీటిని ఉపయోగడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో పాటు మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుందన్న కారణంతో వీటిని విమానంలోకి నిషేధించారు.
* సామ్‌సంగ్ గ్యాలక్సీ నోట్ 7 ఫోన్‌ను కూడా విమానంలోకి అనుమతించడం లేదు. ఈ ఫోన్‌లో మంటలు చెలరేగిన సంఘటనలు ఉన్న నేపథ్యంలో వీటిని విమానంలోకి అనుమతిని నిషేధించారు.
* ఇక విమానంలోకి అనుతమించిన మరో వస్తువు అధిక శక్తితో పనిచేసే లేజర్ పాయింటర్లు. ఇవి పైలట్స్‌ల దృష్టిని మరల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని నిషేధించారు.
* పెద్ద కెపాసిటీ కలిగిన లిథియం బ్యాటరీలను కూడా విమానాల్లో తీసుకెళ్లడాన్ని నిషేధించారు. ఇవి కూడా మంటలు చెలరేగడానికి కారణమవుతుండొచ్చని వీటిని నిషేధించారు.
* చాలా వరకు విమానాయ సంస్థలు విమానాల్లో పోర్టబుల్ ఛార్జర్‌లను నిషేధించాయి. దీనికి కారణం వీటిలో ఉండే లిథియం బ్యాటరీనే.
* స్టన్, టేజర్ గన్స్ వంటి వాటిని విమానాల్లోకి అనుమతించరు. ఆత్మరక్షణ వెపన్స్‌గా పనిచేసే వీటిని విమానయాన సంస్థలు వాటిని ఆయుధాలుగా పరిగణిస్తాయి. సిబ్బందితో పాటు తోటి ప్రయాణీకుల భద్రతకు ముప్పు కలిగిస్తాయి కాబట్టి వీటిని అనుమతించరు.