Vivo Y29 5G: భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ 5జీ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే వావ్ అనాల్సిందే..!
Vivo Y29 5G: దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో 5జీ ఫోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది.
Vivo Y29 5G: దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో 5జీ ఫోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరతో కూడిన ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై29 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మంగళవారం ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో భారత మార్కెట్లోకి వివో వై29 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కాగా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,499గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర విషయానికొస్తే రూ. 16,999, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు క్యాష్‌బాక్ పొందే అవకాశం కల్పించారు.
ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.68 ఇంచెస్‌తో కూడిన 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను అందించారు. 720*160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్, 264 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ పోన్ 6ఎన్‌ఎం ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే 44 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
‘మిలిటరీ గ్రేడ్’ డ్యూరబిలిటీని అందించారు. ఈ ఫోన్‌ను డైమండ్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ, టైటానియం గోల్డ్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడని ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. సెక్యూరిటీ పరంగా ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట సెన్సర్‌ను ఇచ్చారు. 79 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
డైనమిక్ లైటింగ్‌కు సపోర్ట్ చేసే రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట ఫోన్‌లో 5జీ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎం, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లను అందించారు. అలాగే యాక్సెలరో మీటర్, ఈ-కంపాస్, అంబియెంట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.