Vivo V40 Series: దుమ్ములేపుతున్న వివో.. రెండు కొత్త ఫోన్లు లాంచ్.. ఏమున్నాయ్ బ్రో..!

Vivo V40 Series: వివో వి40 సిరీస్ Vivo V40, Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్లను ఈ రోజు లాంచ్ చేయనుంది. వీటిలో 50 మెగాపిక్సెల్‌‌తో మొత్తం నాలుగు కెమెరాలు కనిపిస్తాయి

Update: 2024-08-07 06:38 GMT

Vivo V40 Series

Vivo V40 Series: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo ఈరోజు రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేయనుంది. ఇందులో Vivo V40, Vivo V40 Pro ఉన్నాయి . ఈ ఫోన్లు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ ఈ ఫోన్‌లలో అద్భుతమైన ZEISS కెమెరా సెటప్‌ను అందించబోతోంది. వీటిలో మీకు 50 మెగాపిక్సెల్‌‌తో మొత్తం నాలుగు కెమెరాలు కనిపిస్తాయి. మీరు కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఫోన్ లాంచింగ్ ఈవెంట్‌ను చూడొచ్చు. ఫోన్ల ప్రారంభ ధర రూ.30 నుంచి 35 వేల మధ్య ఉంటుంది. ఫోన్లు లాంచ్ కావడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది.

(వివో వి40 సిరీస్ స్పెసఫికేషన్స్) Vivo V40 Series Specifications
వివోకంపెనీ గ్లోబల్ వేరియంట్‌లో 6.78 అంగుళాల 1.5K డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో ఈ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ Vivo V40లో Snapdragon 7 Gen 3ని అందిస్తోంది. అదే సమయంలో Vivo V40 Pro MediaTek డైమెన్షన్ 9200+ ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కెమెరా లవర్స్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ సిరీస్‌లోని ప్రో వేరియంట్‌లో మీరు ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 మెయిన్ కెమెరాను చూడవచ్చు. ఈ కెమెరా OIS ఫీచర్‌తో వస్తుంది. ఇది కాకుండా 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ IMX816 టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్‌ ఉంటాయి. ఈ కెమెరా 50x హైపర్ జూమ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. మరోవైపు సిరీస్ బేస్ వేరియంట్‌లో మీరు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను చూస్తారు.

రెండు ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్ బెస్ట్ సెల్ఫీ కెమెరాను కంపెనీ అందిస్తోంది. బ్యాటరీ విషయానికి వస్తే మీరు Vivo V40లో 5000mAh బ్యాటరీ, V40 Proలో 5500mAh బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్‌లు 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. కంపెనీ ఫోన్లకు IP68 రేటింగ్ కూడా ఇస్తోంది. అంతేకాకుండా దీనిలో స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి.

Tags:    

Similar News