Samsung Galaxy S24 FE: పోలా అదిరిపోలా.. సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్.. దీన్ని కొట్టేది లేదు పో..!

Samsung Galaxy S24 FE: సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ని త్వరలో లాంచ్ చేయనుంది. దీని ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి.

Update: 2024-09-10 10:49 GMT

Samsung Galaxy S24 FE

Samsung Galaxy S24 FE: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై స్పెషల్ ఫోకస్ చేసింది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్‌ వరకు తన హవాని కొనసాగిస్తుంది. ముఖ్యంగా చైనాకు చెందిన బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తూ స్ట్రాంగ్ కాంపిటీటర్‌గా నిలిస్తుంది. ఈ క్రమంలో తాజాగా భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్‌లో S24 FE ఫోన్ విడుదల చేయనున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం

Samsung Galaxy S24 FE Price
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. Galaxy S24 FE ధర ఈ సంవత్సరం $100 (రూ. 8,397) వరకు ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా S24 FE ధర $699 (సుమారు రూ. 58,699) అవుతుంది. పోల్చి చూస్తే Galaxy S3 FE $599 (రూ. 50,301)గా ఉండనుంది. ధర పెరిగినప్పటికీ ర్యామ్ లేదా స్టోరేజ్‌కి ఎటువంటి అప్‌గ్రేడ్‌లు ఉండవని లీక్ సూచిస్తుంది. బేస్ మోడల్ ఇప్పటికీ 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Samsung Galaxy S24 FE Specifications
S23 FE స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాలతో పోలిస్తే S24 FE పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6.7-అంగుళాల ప్యానెల్. ఈ గెలాక్సీ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్‌లో ఇప్పటివరకు చూడని అతిపెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఫ్లాగ్‌షిప్ S24 అల్ట్రా సైజుకు దగ్గరగా ఉంటుంది. S24 FE స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 లేదా Exynos 2400ని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు.

హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో ప్యాక్ చేయబడవచ్చు. అంటే ఫోన్ నీరు, దుమ్ము వల్ల పాడైపోదు. ఫోన్ 4,600mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఫోన్‌ని 25W వేగంతో ఛార్జ్ చేయగలదు. కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో పోర్ట్రెయిట్ స్టూడియో, గెలాక్సీ AI ఫీచర్లు కూడా ఉంటాయి. ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 8MP టెలిఫోటో సెన్సార్‌తో అటాచ్ చేయబడుతుంది. ఫోన్ ముందు భాగంలో 10MP సెన్సార్ ఉంటుంది.

Tags:    

Similar News