Samsung New Budget Phone: ఇదెక్కడి అరాచకం బ్రో.. సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ కిల్లర్.. మార్కెట్ షేక్ అవ్వడం పక్కా..!

Samsung New Budget Phone: సామ్‌సంగ్ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Samsung Galaxy S24 FEని త్వరలో మార్కెట్లో విడుదల చేయబోతోంది. లాంచ్ చేయడానికి ముందు దాని రెండర్‌లు లీక్ అయ్యాయి.

Update: 2024-09-07 13:48 GMT

Samsung Galaxy S24 FE

Samsung New Budget Phone: టెక్ దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా గ్యాడ్జెట్లను తీసుకొస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. కంపెనీ తాజాగా బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Samsung Galaxy S24 FEని త్వరలో మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఫోన్ లాంచ్ చేయడానికి ముందు దాని రెండర్‌లు లీక్ అయ్యాయి. ఇవి ఫోన్ హై క్వాలిటీ గల రెండర్‌లు అని క్లెయిమ్ చేయబడుతోంది. దీని కారణంగా ఫోన్ కలర్ వేరియంట్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ నాలుగు కలర్ వేరియంట్‌లలో కనిపించింది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE లాంచ్‌కు ఎక్కువ సమయం మిగిలి ఉన్నట్లు కనిపించడం లేదు. ఫోన్‌పై పుకార్లు జోరందుకున్నాయి. ఫోన్ రెండర్‌లు లీక్ అయినట్లు ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ పేర్కొంది. ఫోన్ డిజైన్, దాని కలర్ వేరియంట్‌లు కూడా వీటిలో స్పష్టంగా కనిపిస్తాయి. నివేదిక ప్రకారం ఫోన్ బ్లూ, గ్రాఫైట్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో లాంచ్ కానుంది.

ఫోన్‌కు సంబంధించిన లీక్ అయిన రెండర్‌లను చూస్తే.. ఇది Samsung Galaxy S23 FE వలె అదే డిజైన్‌ను కలిగి ఉందని చెప్పవచ్చు. అది ఫోన్ వెనుక ప్యానెల్ డిజైన్ కావచ్చు, కెమెరా మాడ్యూల్ కావచ్చు లేదా పంచ్ హోల్ డిస్‌ప్లే కావచ్చు. అయితే, ఫ్రేమ్‌లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. కొత్త ఫోన్‌లో ఫ్లాట్ డిజైన్ చూడవచ్చు.

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే ఫోన్ 6.7 అంగుళాల FHD ప్లస్ డిస్‌ప్లేతో రావచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1900 nits పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. దానిపై గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షణ్ చూడవచ్చు. ఈ ఫోన్ కంపెనీ తాజా ప్రాసెసర్ Exynos 2400 తేలికపాటి వెర్షన్‌తో రావచ్చు. ఇది వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉండవచ్చు. దానితో పాటు 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3X జూమ్ సామర్థ్యాన్ని టెలిఫోటో లెన్స్‌లో చూడవచ్చు. అలానే ఇందులో 25 వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ ఫోన్‌లో చూడవచ్చు.

Tags:    

Similar News