Amazon Offers: అమెజాన్ భారీ ఆఫర్.. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!
Amazon Offers: సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్‌లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. బడ్జెట్ మొబైల్స్ కూడా అందులో బలమైన ట్రెండ్ సెట్ చేశాయి.

Amazon Offers: సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్‌లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. బడ్జెట్ మొబైల్స్ కూడా అందులో బలమైన ట్రెండ్ సెట్ చేశాయి. 'Samsung Galaxy M15 5G Prime Edition' ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ప్రస్తుతం ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బేస్ ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.
Samsung Galaxy M15 5G Prime Edition Offers
సామ్‌సంగ్ గెలాక్సీ M15 5జీ ప్రైమ్ ఎడిషన్ ఫోన్ అమెజాన్‌లో 24శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని ధర రూ.12,999గా ఉంది ఈ ఫోన్‌లో రూ.389 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. మీరు ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ,స్టోన్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
Samsung Galaxy M15 5G Features
సామ్‌సంగ్ గెలాక్సీ M15 5జీ ప్రైమ్ ఎడిషన్ మొబైల్‌లో 6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1080 × 2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లే. స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఆర్మ్ మాలి G57 MC2 GPU అందించారు. ఈ ఫోన్‌లో 4GB RAM + 128GB, 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1 TB వరకు స్టోరేజీని విస్తరించుకునే అవకాశం ఉంది.
ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది. అలానే 5-మెగాపిక్సెల్ రెండవ కెమెరా, 2-మెగాపిక్సెల్ మూడవ కెమెరాను కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్‌ని ఛార్జ్ చేయడానికి 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh కెపాసిటీ బ్యాటరీ అందించారు. ఈ ఫోన్‌లో USB టైప్ C ఆడియో, స్టీరియో స్పీకర్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.2, NFC, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి.