Jio Laptop: మరో సంచలనానికి 'జియో' సిద్దమైందా?

Jio Laptop: 4G LTE కనెక్టివిటీ, JioOS తో పనిచేసే ల్యాప్‌టాప్ లు తెచ్చేందుకు రిలయెన్స్ జియో పనిచేస్తుందని సమాచారం.

Update: 2021-03-05 12:28 GMT

జియో

Jio Laptop: తక్కువ ధరకే ఇంటర్నెట్‌, ఫీచర్‌ ఫోన్లను తీసుకొచ్చిన రిలయెన్స్ జియో..ప్రస్తుతం మరో సంచలనానికి రెడీ అయిందని టెక్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నింస్తుందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ల్యాప్ టాప్ తయారీ పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. 'జియో బుక్(Jio Book)‌' పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించిందని, వీలైతే ఈ ఏడాది మే నాటికి ప్రజల ముందుకు తీసుక రావొచ్చని సమాచారం.

జియో బుక్‌ విశేషాలు..?(JioBook Specifications)

ఈ జియో బుక్ లు సెల్యులార్‌ కనెక్షన్‌తో పనిచేసేలా ప్లాన్ చేస్తున్నట్లు క్వాల్‌కోమ్ సీనియర్‌ ప్రొడక్ట్ డైరక్టర్‌ మిగ్యుల్‌ న్యూన్స్ తెలిపారు. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో కాకుండా, గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ని కొద్దిగా మార్పులు చేసి జియో బుక్ ల్యాప్ టాప్ లలో వినియోగిస్తారని తెలుస్తోంది. దీనిని జియో ఓఎస్‌ అని పిలుస్తారని సమాచారం.

JioBook: Photo Credit: XDA Developers (ప్రతీకాత్మక చిత్రం)

తక్కువ ధరల్లో తీసుకొచ్చేందుకుగాను క్వాల్కోమ్‌‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ను జియో ల్యాప్‌టాప్ లలో ఉపయోగిస్తున్నారట. ఇప్పటికే చాలా ఫోన్లలో ఈ చిప్‌ను వినియోగిస్తున్నారు. దీనిలో ఇన్‌-బిల్ట్‌ 4జీ ఎల్‌టీఈ మోడెమ్ ఉండనున్నట్ల తెలుస్తుంది. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ తో పాటు 5 గిగా హెడ్జ్‌ వైఫై సపోర్ట్‌, బ్లూటూత్‌, క్వాల్‌కోమ్‌ ఆడియో చిప్‌, 3 యాక్సిస్‌ యాక్సెలెరోమీటర్‌ లను వాడనున్నారు. వీటితో పాటు ఈ ల్యాప్‌టాప్‌‌లో జియో స్టోర్‌, జియో మీట్‌, జియో పేజెస్‌, జియో యాడ్‌ సర్వీసులను ప్రీలోడ్ గా అందించనున్నారని సమాచారం.

అయితే ల్యాప్‌టాప్ ధరలపై మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. ఇంటర్నెట్ తోపాటు మొబైల్‌ ఫోన్స్‌ను తక్కువ ధరకే అందించి విపణిలో సంచలనం క్రియోట్ చేసిన జియో.. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లను కూడా బడ్జెట్ ధరలోనే తీసుకొస్తుందని టెక్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News