Jio Prepaid Plan: 84 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా ఓటీటీలు.. జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లో మరెన్న్ ఆఫర్లు..!

Jio Prepaid Plan: మీకు మొబైల్ 5G డేటా ప్లాన్‌తో పాటు OTT ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుందని చెబితే, నమ్ముతారా.. ఇది మీరు జోక్‌గా తీసుకుంటే, పొరబడినట్లే. జియో నుంచి సరికొత్త ప్లాన్ మీకోసం వచ్చింది.

Update: 2023-12-09 14:00 GMT

Jio Prepaid Plan: 84 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా ఓటీటీలు.. జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లో మరెన్న్ ఆఫర్లు..!

Jio Prepaid Plan: మీకు మొబైల్ 5G డేటా ప్లాన్‌తో పాటు OTT ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుందని చెబితే, నమ్ముతారా.. ఇది మీరు జోక్‌గా తీసుకుంటే, పొరబడినట్లే. జియో నుంచి సరికొత్త ప్లాన్ మీకోసం వచ్చింది. ఇందులో అపరిమిత 5G డేటా పొందవచ్చు. అలాగే వీటితోపాటు మీరు Sony Liv, Zee5 వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

రూ. 909 ప్లాన్ ప్రయోజనాలు..

జియో రూ.909 ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే, మీకు 84 రోజుల పాటు ప్రతిరోజూ గరిష్టంగా 2 GB డేటా లభిస్తుంది. అలాగే, రోజూ 100 SMSల సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మీకు Sony LIV, Zee 5, Jio TV ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఇది కాకుండా, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్ అందిస్తుంది.

5G రీఛార్జ్ ప్లాన్ త్వరలో ప్రారంభం..

5G నెట్‌వర్క్‌ను ఒక సంవత్సరం క్రితం జియో విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో 5G సేవ అందుబాటులో ఉంది. ప్రస్తుతం, జియో, ఎయిర్‌టెల్ రెండూ ఉచిత 5G డేటాను అందిస్తున్నాయి. ఇందుకోసం కనీసం రూ.249 రీఛార్జ్ చేసుకోవాలి. నివేదిక ప్రకారం, 5G రీఛార్జ్ ప్లాన్‌ను త్వరలో Ji, Airtel ప్రారంభించవచ్చు. అయితే, Jio, Airtel నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మీరు 5G డేటా ప్లాన్‌తో ఉచిత OTT ప్లాట్‌ఫారమ్‌కు కూడా సభ్యత్వాన్ని పొందాలనుకుంటే, Jio ఈ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపికగా ఉంటుంది. జియో ఈ ప్లాన్‌తో పాటు, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా కూడా అలాంటి కొన్ని ప్లాన్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాటి గురించి సమాచారం వారి అధికారిక సైట్‌లలో మీ కోసం అందుబాటులో ఉంది.

Tags:    

Similar News