Jio Prepaid Plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్.. ధర ఎంతో తెలుసా?

Reliance Jio New Prepaid Plans: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

Update: 2023-08-19 14:30 GMT

Jio Prepaid Plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్.. ధర ఎంతో తెలుసా?

Reliance Jio New Prepaid Plans: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు కొత్త ప్లాన్‌ల ధర ₹1,099, ₹1,499లుగా ఉన్నాయి. కాగా, ఇవి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటాయి. ప్రీపెయిడ్ ప్లాన్‌తో కంపెనీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు Jio పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్లాన్‌లను అందిస్తోంది.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, రూ.1,099 ప్లాన్‌లో కస్టమర్‌లు రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 84 రోజుల పాటు Netflix మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. అయితే, రూ. 1,499 ప్లాన్‌లో, కస్టమర్‌లు రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 84 రోజుల పాటు ప్రాథమిక నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.

రూ. 1,499 ప్లాన్‌లో బిగ్ స్క్రీన్‌పై నెట్‌ఫ్లిక్స్‌..

రూ. 1,499 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉన్న కస్టమర్‌లు మొబైల్ అలాగే టీవీ లేదా ల్యాప్‌టాప్ వంటి ఏదైనా పెద్ద స్క్రీన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను చూడొచ్చు. మీడియా నివేదికల ప్రకారం, వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ యాప్‌ను బహుళ పరికరాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ చూడటానికి అదే ఖాతాతో లాగిన్ చేయవచ్చు. అయితే, ఒక డివైజ్‌లో ఒకసారి మాత్రమే వీడియోను చూడొచ్చు.

కొత్త ప్లాన్‌ను ప్రారంభించిన సందర్భంగా జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ CEO కిరణ్ థామస్ మాట్లాడుతూ, 'మా వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. ప్రీపెయిడ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ బండిల్‌ను ప్రారంభించడం మా పరిష్కారానికి ఒక అడుగు. Netflix వంటి ప్రపంచ భాగస్వాములతో మా భాగస్వామ్యం బలపడింది' అంటూ చెప్పుకొచ్చాడు.

నెట్‌ఫ్లిక్స్ APAC పార్టనర్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ టోనీ జామ్‌కోవ్‌స్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను చూడటానికి ఈ భాగస్వామ్యం సహాయం చేస్తుందని తెలిపాడు. 'మేం JIOతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. 'లోకల్ కంటెంట్, డాక్యుమెంటరీలు, సినిమాలను ప్రారంభించాం. వీటిని భారతదేశం అంతటా ప్రజలు ఇష్టపడుతున్నారు. జియోతో మా కొత్త ప్రీపెయిడ్ బండిల్ భాగస్వామ్యం కస్టమర్‌లు భారతీయ కంటెంట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను చూడటానికి సహాయపడుతుంది' అని తెలిపాడు.

Tags:    

Similar News