Redmi Note 14 Pro: రెడ్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. హైలేట్‌గా నిలిస్తున్న ఈ ఫీచర్..!
Redmi Note 14 Pro: రెడ్‌మి నోట్ 14 ప్రో ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు లీక్ అయ్యాయి.
Redmi Note 14 Pro: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మి త్వరలో Redmi Note 14 Seriesను చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ క్రమంలో రెడ్‌మీ నోట్ 14 మోడల్ 3C సర్టిఫికేషన్‌లో రిజిస్టర్ అయింది. దీన్ని రెడ్‌మి నోట్ 13కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా తీసుకురానున్నారు. ఇంతలో ఓ టెక్ ప్రియుడు ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ చివరిలో లాంచ్ అయే అవకాశం ఉందని సూచించాడు. రెడ్‌మి జనరల్ మేనేజర్ వాంగ్ టెంగ్ థామస్, నెక్స్ట్ జనరేషన్ నోట్-సిరీస్ ఫోన్‌లపై పనిచేస్తున్నట్లు తెలిపారు.
Weibo పోస్ట్‌లో కొత్త Redmi నోట్ మోడల్‌లు IP68 రేటింగ్‌ను కలిగి ఉంటాయని థామస్ ధృవీకరించారు. గత సంవత్సరం Redmi Note 13 Pro+ IP68 రేటెడ్ ఛాసిస్‌తో వచ్చింది. అయితే Note 13 Pro, Note 13 IP54 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చాయి. టాప్-టైర్ నోట్ 14 ప్రో+ IP68-రేటెడ్ ఛాసిస్‌ను కలిగి ఉంటుంది. అయితే నోట్ 14 ప్రో అదే IP రేటింగ్‌ను కలిగి ఉంటుందా అనేది తెలియలేదు.
కొత్త Weibo పోస్ట్‌లో కొత్త ఐఫోన్ 16 సిరీస్ లాగా రాబోయే నోట్ మోడల్‌లు లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్స్‌ను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. నోట్ 13 ప్రో 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే 13 Pro+ 120W ఛార్జింగ్‌తో కొంచెం చిన్న 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో+ మోడల్‌లలో బ్రాండ్ పెద్ద బ్యాటరీని అందించే అవకాశం ఉంది.
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం Note14 Pro, Note 14 Pro+లో 1.5K 120Hz OLED కర్వ్డ్ డిస్‌ప్లేని కలిగి ఉంటాయి. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంటాయి. ప్రో మోడల్ ఇటీవల ప్రారంభించిన స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌ను కలిగి ఉండవచ్చు. అయితే Pro+ డైమెన్సిటీ 7350 SoCని కలిగి ఉండవచ్చు. ఈ మోడల్‌లలో ఒకటి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు.