Realme P3 5G Series: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా..!

Realme P3 5G Series: టెక్ కంపెనీ రియల్‌మీ 'Realme P3 5G, Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌లను మార్చి 19 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

Update: 2025-03-17 06:58 GMT
Realme Will Launch the P3 5G and P3 Ultra 5G Smartphones on March 19 Check all Features

Realme P3 5G Series: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా..!

  • whatsapp icon

Realme P3 5G Series: టెక్ కంపెనీ రియల్‌మీ 'Realme P3 5G, Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌లను మార్చి 19 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి కోసం భారతీయ మొబైల్ మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ లాంచ్‌కు రెండు రోజుల ముందు, Realme P3 Ultra 5G Pro మోడల్ ధర రూ. 25,000 కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇదే కాకుండా, Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ అధికారిక డిజైన్ గురించి సమాచారం అందుబాటులోకి వచ్చింది. కంపెనీ టీజర్ ప్రకారం, స్మార్ట్‌ఫోన్ 'మూన్ డార్క్' డిజైన్‌లో, తేలికపాటి బిల్డ్, క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో ఉంటుంది. రియల్‌మీ P3 5జీ, P3 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్ల గురించి మరింత సమాచారాన్ని చూద్దాం.

Realme P3 Ultra 5G

కొత్త రియల్‌మీ P3 అల్ట్రా 5జీ ఒక 'మూన్ డార్క్' డిజైన్‌లో తేలికపాటి బిల్డ్, క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఆకృతి తక్కువ కాంతి పరిస్థితుల్లో ఆకుపచ్చ హాలో ప్రభావాన్ని సృష్టిస్తుంది, ఇది చంద్ర నేల ఆకృతిని ప్రతిబింబిస్తుంది. ఇది చంద్రుని ఉపరితల ధూళిని తాకిన అనుభూతిని వినియోగదారులకు అందిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో అత్యంత సన్నని క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ , 7.38 మిమీ మందం,183 గ్రాముల బరువుతో కంపెనీ ప్రకటించింది. నెప్ట్యూన్ బ్లూ, ఓరియన్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Realme P3 Ultra 5G Features

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో లాంచ్ అయిన ప్రపంచంలోనే మొదటి హ్యాండ్‌సెట్ Realme P3 Ultra 5G. ఇది 1.45 మిలియన్లకు పైగా AnTuTu స్కోర్‌ను సాధించింది. ఫోన్‌లో 12జీబీ ర్యామ్, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. వినియోగదారుల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే GFoamBoost టెక్నాలజీని ఉంది. BGMIలో 90fps గేమ్‌ప్లే, 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే 2,500Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ ఇస్తుంది. 6,000mAh బ్యాటరీ, 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది.

Realme P3 5G Features

రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 SoC ప్రాసెసర్ ఉంది, ఇది 15 శాతం మెరుగైన CPU పనితీరును అందిస్తుంది. AnTuTu పరీక్షలో 7,50,000 పాయింట్లు సాధించింది. GT బూస్ట్ AI మోషన్ కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్ వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది. BGMI కోసం 90fps గేమ్‌ప్లేకు సపోర్ట్ ఇస్తుంది. యాంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ 2.0 టెక్నాలజీ తక్కువ-సిగ్నల్ ప్రాంతాలలో హ్యాండ్‌సెట్ కనెక్టివిటీని 30 శాతం పెంచుతుంది.

Tags:    

Similar News