Realme Narzo 80x 5G: కొంటే ఇలాంటి ఫోనే కొనాలి.. రూ.12,499లకే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?
Realme Narzo 80x 5G: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాటరీ బ్యాకప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

Realme Narzo 80x 5G: కొంటే ఇలాంటి ఫోనే కొనాలి.. రూ.12,499లకే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?
Realme Narzo 80x 5G: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాటరీ బ్యాకప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ ఉన్న మొబైల్ కోసం చూస్తున్నారు. మీరు కూడా పెద్ద బ్యాటరీతో 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మీకో గుడ్ న్యూస్ ఉంది. రియల్‌మీ తన నార్జో సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేస్తోంది. మిడ్-బడ్జెట్ Realme Norzo 80 Pro 5G ఫోన్‌తో పాటు, తక్కువ-బడ్జెట్ Realme Norzo 80x 5G మొబైల్‌ను తీసుకొస్తుంది, ఈ 5G ఫోన్‌ను విడుదల చేయడానికి ముందే కంపెనీ దాని ధరను వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
Realme Narzo 80x 5G Price And Offers
రియల్‌మీ నార్జో 80ఎక్స్ 5జీ ఫోన్‌ను రూ. 13,000 కంటే తక్కువ ధరకు విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ.12,499. లేదా రూ. 12,999. కంపెనీ ప్రకారం.. ఈ చౌకైన 5G ఫోన్ సేల్ ఏప్రిల్ 11 నుండి ప్రారంభమవుతుంది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్. ఈ కాలంలో మీరు స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ఇంకా, కంపెనీ ముందస్తు సేల్ కోసం ఆఫర్లను ప్రకటించింది. ఫస్ట్ సేల్ ముగిసిన తర్వాత ఫోన్ ధర రూ. 13,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా కొత్త రియల్‌మీ 5G ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు.
Realme Narzo 80x 5G Features
కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో నడిచే Realme Norzo 80x 5G ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఈ రియల్‌మీ మొబైల్ బ్యాటరీ దాని అతిపెద్ద యూఎస్‌పి. ఫోన్ శక్తివంతమైన 6,000mAh కెపాసిటీ గల టైటానియం బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీనితో పాటు, 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రియల్‌మీ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మిలిటరీ గ్రేడ్ బాడీ, IP69 రేటింగ్‌తో ఉంటుంది.
Realme Narzo 80 Pro 5G Features
రియల్‌మీ నార్జో 80 ప్రో 5జీ గేమింగ్ ఫోన్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్‌లో గేమింగ్ కోసం 6050mm వీసి కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇది గేమింగ్ సమయంలో మొబైల్‌ను చల్లగా ఉంచుతుంది. ఈ ఫోన్‌లో క్విక్ టచ్ శాంపిల్ రేట్ 2500Hz అందుబాటులో ఉంది. ఈ రియల్‌మీ 5G ఫోన్ 6,000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.