Realme Narzo 70 Turbo 5G: వారెవ్వా ఫోన్ అంటే ఇలా ఉండాలి.. రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్..!
Realme Narzo 70 Turbo 5G: రియల్‌మీ NARZO సిరీస్‌లో Realme NARZO 70 Turbo 5Gని లాంచ్ చేయనుంది. ఇది మోటార్‌స్పోర్ట్ డిజైన్‌తో వస్తుంది.
Realme Narzo 70 Turbo 5G: రియల్‌మీ తన ఫేమస్ NARZO సిరీస్‌లో త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. Realme NARZO 70 Turbo 5Gని లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ ఆకర్షణీయమైన మోటార్‌స్పోర్ట్ డిజైన్‌తో వస్తుంది. డిజైన్‌తో పాటు యువత కోసం టర్బో టెక్నాలజీకి సంబంధించిన అనేక ఫీచర్లను కూడా ఈ ఫోన్ కలిగి ఉండనుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఆకర్షణీయమైన మోటార్‌స్పోర్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో కొత్త టర్బో టెక్నాలజీ ఉంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే రిలీజ్ అయిన Realme Narzo 70 Turbo 5G లైనప్ మోడల్‌లో రానుంది. ఇందులో Narzo 70 Pro కూడా ఉంది. Realme Narzo 70 Turbo 5G 7.6mm సన్నని స్టైలిష్ స్లిమ్ లుక్‌తో వస్తుంది. ఫోన్‌లో టర్బో టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఇది యూజర్స్‌కు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ప్రాసెసర్ కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫోన్ లాంచ్ అయే అవకాశం ఉంది.
Realme Narzo 70 Turbo 5G Features
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం మోడల్ నంబర్ RMX5003తో Realme Narzo 70 Turbo 5G ఫోన్‌ను త్వరలో విడుదల కావచ్చు. ఫోన్‌లో 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలు చేయవచ్చని లీకైన అప్‌డేట్‌లు సూచిస్తున్నాయి.
ఫోన్ వెనుకవైపు ఫోన్ F/1.9, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్‌తో 12.6 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. సెన్సార్ 4,096 x 3,072 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఫోటోలను హెచ్‌డీ క్వాలిటీతో క్యాప్చర్ చేస్తుంది. కంపెనీ దీనిని 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో తీసుకురావచ్చు.