Realme GT 7: అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. 7000mAh బ్యాటరీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో..!
Realme GT 7: రియల్‌మీ GT 7 ఏప్రిల్‌లో చైనాలో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ ద్వారా వస్తుందని కంపెనీ ధృవీకరించింది.

Realme GT 7: అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. 7000mAh బ్యాటరీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో..!
Realme GT 7: రియల్‌మీ GT 7 ఏప్రిల్‌లో చైనాలో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ ద్వారా వస్తుందని కంపెనీ ధృవీకరించింది. లాంచ్‌కు ముందు, సీనియర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఈ హ్యాండ్‌సెట్ బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలను వెల్లడించారు. ఇంతలో కొన్ని ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రియల్‌మీ GT 7లో 7,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యారటీ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Realme వైస్ ప్రెసిడెంట్ Xu Qi చేజ్ Weibo పోస్ట్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ ఛాసిస్ తేలికగా ఉంటుందని తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్ 'సన్నని అంటే తక్కువ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది వంటి ప్రమాణాలను విచ్ఛిన్నం చేస్తుందని ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ RMX6688. ఈ ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని లిస్టింగ్ వెల్లడించింది.
రియల్‌మీ GT 7 మందం 8.3మిమీ కంటే తక్కువగా ఉంటుంది. బరువు 205 గ్రాముల కంటే తక్కువగా ఉంటుంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ విషయాన్ని Weibo పోస్ట్‌లో తెలిపింది. హ్యాండ్‌సెట్ బహుశా 'ColorOS తో వస్తుందని, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అవుతుందని లీక్స్ సూచిస్తున్నాయి. కస్టమైజ్ BOE ప్యానెల్ ఉంటుంది. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ప్లాస్టిక్ మిడిల్ ఫ్రేమ్, IP69-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ బిల్డ్ కలిగి ఉంటుంది. బయోమెట్రిక్ కోసం హ్యాండ్‌సెట్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇంతకుముందు ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో నడుస్తుందని కంపెనీ ధృవీకరించింది.