Portable AC: ఐస్ కంటే చల్లని కూలింగ్ క్షణాల్లోనే.. ఈ పోర్టబుల్ ఏసీతో విద్యుత్ బిల్ రందే ఉండదు.. ఖర్చు కూడా తక్కువే..!

Portable AC: వేసవి కాలం ప్రారంభమైంది. చాలా తీవ్రమైన వేడితో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు వాడుతున్నారు. అయితే, సాధారణ కూలర్ ఫ్యాన్‌తో ఈ వేడిని ఆపడం చాలా కష్టం.

Update: 2023-04-27 09:30 GMT

Portable AC: ఐస్ కంటే చల్లని కూలింగ్ క్షణాల్లోనే.. ఈ పోర్టబుల్ ఏసీతో విద్యుత్ బిల్ రందే ఉండదు.. ఖర్చు కూడా తక్కువే..!

Portable AC: వేసవి కాలం ప్రారంభమైంది. చాలా తీవ్రమైన వేడితో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు వాడుతున్నారు. అయితే, సాధారణ కూలర్ ఫ్యాన్‌తో ఈ వేడిని ఆపడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితిలో, మీరు ఎయిర్ కండీషనర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని చూస్తున్నారా.. వాటి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ ఖర్చులో ఇంటిని చల్లగా మార్చే చిన్న ఎయిర్ కండీషనర్‌ను మీకు పరిచయం చేయబోతున్నాం. ఇది నిమిషాల్లోనే మీ గదిని చల్లబరుస్తుంది.

పోర్టబుల్ ఎయిర్ కండీషనర్..

ఈ పోర్టబుల్ టేబుల్ డ్రై ఐస్ ఎయిర్ కండీషనర్ రెప్పపాటులో మీ ప్రాంతాన్ని చల్లబరుస్తుంది. ఈ ఎయిర్ కండీషనర్ చాలా శక్తివంతంగా పని చేస్తుంది. మీరు కొన్ని నిమిషాల్లో చలి అనుభూతి చెందుతారు. కొద్దిసేపటి తర్వాత దుప్పటితో కప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. దీన్ని ఉపయోగించడానికి మీకు డ్రై ఐస్ మాత్రమే అవసరం. నిజానికి డ్రై ఐస్ అనేది మీరు మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడం ద్వారా ఈ ఎయిర్ కండీషనర్ చల్లని గాలిని అందిస్తుంది.

ఈ ఎయిర్ కండీషనర్ ఎలా పని చేస్తుందంటే..

ఎయిర్ కండీషనర్‌లో ప్రత్యేకమైన ఐస్ ఛాంబర్ ఉంది. దీనిలో మీరు డ్రై ఐస్‌ను ఉంచాలి. ఈ ఎయిర్ కండీషనర్‌లో అమర్చిన ఫ్యాన్ ఈ డ్రై ఐస్ నుంచి బయటకు వచ్చే చల్లదనాన్ని ముందు కూర్చున్న వ్యక్తి వైపు విసరడం ప్రారంభిస్తుంది. ఈ ఎయిర్ కండీషనర్ మీ ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి నడిపించోచ్చు. ఇటువంటి పరిస్థితిలో విద్యుత్ బిల్లు పెరగదు. ఈ రకమైన కూలర్లు ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఎన్నో ఉన్నాయి. వీటిని రూ.500 నుంచి 1300లలోపే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Tags:    

Similar News