Poco X3 Pro: పోకో ఎక్స్ 3 ప్రో ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే..!
Poco X3 Pro: పోకో ఎక్స్ 3 ప్రో, పోకో ఎఫ్ 3 స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యాయి.
Poco X3 Pro: పోకో ఎక్స్ 3 ప్రో, పోకో ఎఫ్ 3 స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యాయి. మార్చి 30 న పోకో ఎక్స్ 3 ప్రో ఇండియాలో లాంచ్ కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. పోకో ఎఫ్ 3 రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు.
పోకో ఎక్స్ 3 ప్రో లాంచ్ ఈవెంట్ మార్చి 30న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ లో టీజర్ ను రిలీజ్ చేశారు. దీనిలో ఫోన్, దాని ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 డిజైన్‌ను హైలైట్ చేసి చూపించారు. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వేరియంట్ ను పోలి ఉన్నాయి. పోకో ఎక్స్ 3 ప్రో ధర బేస్ మోడల్ 249 యూరోలు (సుమారు రూ. 21,400), హై-ఎండ్ మోడల్ 299 యూరోలు (సుమారు రూ. 25,800) వద్ద ప్రారంభమవుతుంది. ఇది ఫ్రాస్ట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, అలాగే మెటల్ కాంస్య రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.
పోకో ఎక్స్ 3 ప్రోలో 6.67-అంగుళాల డాట్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో విడుదల కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్ ను అందించారు. ఈ ఫోన్ లో 8GB RAM, 256GB స్టోరేజ్ ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.
పోకో ఎక్స్ 3 ప్రోలో 48 MP సోనీ IMX582 మెయిన్ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ను కలిగిన క్వాడ్-కెమెరా సెటప్ తో రానుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 20 MP కెమెరాను అందించారు. ఈ ఫోన్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 5,160 mAh బ్యాటరీని కలిగి ఉంది.