Oneplus 13: అబ్బో ఇదేం ఫోనూ.. పిచ్చెక్కిస్తున్న కొత్త వన్‌ప్లస్ ఫోన్ లీక్స్..!
Oneplus 13: OnePlus తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 13 ని 6000 mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ఫీచర్లు లీక్ అయ్యాయి.
Oneplus 13: OnePlus కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 13 ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్దమైంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం అవందుబాటులో లేదు. ఇప్పుడు తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఒక్కొట్టిగా లీక్ అవుతున్నాయి. ఈ కొత్త ఫోన్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో లాంచ్ అవడం ఖాయమని తెలుస్తుంది. రండి ఇప్పుడు ఈ ఫోన్ ధరలు, ఫీచర్లు తెలుసుకుందాం.
OnePlus మొదటి నుంచి కూడా క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈ కంపెనీ ఫోన్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎక్కువ మంది ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. OnePlus 13 కూడా ఈ లైన్‌లో చేరనుంది. ఈ కొత్త మొబైల్ దేశంలో పెద్ద 6000mAh కెపాసిటీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. కొత్త OnePlus ధర గతంలో లాంచ్ అయిన OnePlus 12 ఫోన్ ధరతో సమానంగా ఉంటుంది.
OnePlus 13 Features And Specifications
లాంచ్ డేట్ ప్రకటించకముందే వన్‌ప్లస్ 13 మొబైల్ ఫీచర్లు లీక్ అయ్యాయి. నివేదిక ప్రకారం ఇది 6.7 అంగుళాల మైక్రో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ 1440 x 3168 పిక్సెల్‌ల 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, LTPO టెక్నాలజీతో కూడిన అల్ట్రాసోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. రాబోయే OnePlus 13 స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది O916T హాప్టిక్ మోటార్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.
కంపెనీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో OnePlus 13 ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఇది పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో కూడిన మల్టీ-ఫోకల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT 808 మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ IMX882 కెమెరా లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఫోన్ LED ఫ్లాష్, వివిధ కెమెరా ఫీచర్లను కలిగి ఉంటుంది.
OnePlus 13 మొబైల్ OnePlus 12 ఫోన్ కంటే పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 6000mAh కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 100W వైర్డు ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడుతుంది. ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/69 రేటింగ్‌ను పొందుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో USB టైప్-సి పోర్ట్, Wi-Fi, GPS మొదలైనవి ఉన్నాయి.
OnePlus 13 Price
నివేదిక ప్రకారం OnePlus 13 ఫోన్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయితే ధర గురించి కంపెనీ ఇంకా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రకటించలేదు. ఈ ఫోన్ ధరకు తగిన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇప్పటికీ OnePlus 12 ఫోన్ భారతదేశంలో రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేయబడింది. అందులో 12GB+256GB, 16GB+512GB వేరియంట్‌లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.64,999.రూ. 69,999.