Carl Pei, Nothing Earbuds: వన్ ప్లస్ మాజీ సీఈఓ కంపెనీ "నథింగ్" నుంచి సరికొత్త ఇయర్ బడ్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. "ఇయర్ వన్" పేరుతో వీటిని విడుదల చేశారు. ఇప్పటి వరకు "నథింగ్" కంపెనీ నుంచి ఇండియన్ మార్కెట్లో విడుదలైన మొదటి ప్రోడక్ట్ ఇదే. ప్రీమియమ్ బ్రాండ్ అయినప్పటికీ ఇండియన్ కస్టమర్ల కోసం బడ్జెట్ ధరలోనే వీటిని విడుదల చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు వైర్ లెస్ చార్జింగ్ వంటి అన్ని లేటెస్ట్ ఫీచర్స్ "ఇయర్ వన్" లో అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో వీటి ధర 5999 గా సంస్థ ప్రకటించింది. అయితే విదేశీ మార్కెట్లో వీటి ధర 8700. గ్లోబల్ మార్కెట్ ధరకు ఇండియన్ మార్కెట్ ధరకు 2700 రూపాయల తేడా ఉందన్నమాట.
భారత మార్కెట్ పెద్దది కాబట్టి ఒక్కసారి భారత మార్కెట్లో పెద్ద వాటా సంపాదిస్తే గ్లోబల్ మార్కెట్ కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చన్న ఉద్దేశంతో "ఇయర్ వన్" ను ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరకు విడుదల చేశారని తెలుస్తోంది. నథింగ్ ఇయర్ వన్ ఇయర్ బడ్స్ లో 11.6 డైనమిక్ డ్రైవర్లు, ఏఎన్సీ సపోర్ట్‌తో వస్తాయి. ఆండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్లకు బ్లూటూత్ వి5.2 సపోర్ట్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే 5 నుంచి 7 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. యూఎస్బీ టైప్ సీ చార్జర్ తో 10 నిముషాలు చార్జ్ చేస్తే 8 గంటల ప్లేబ్యాక్ పొందవచ్చు.