Mobile Reboot: వారానికి ఒకసారి "రీబూట్" చేస్తేనే మీ ఫోన్లు సేఫ్..

Update: 2021-08-02 07:24 GMT

మొబైల్ రీస్టార్ట్ (ఫైల్ ఫోటో) 

Mobile Reboot: గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల పేర్లతో మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ గురించి వింటూనే ఉన్నాం. ఇటీవల పెగాసస్ అనే స్పైవేర్ మన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలను ఒక కుదుపు కుదిపేసింది. మన ఫోన్లలోకి కొన్ని ఫార్వర్డ్ మెసేజ్ లింక్స్ ద్వారా చొరబడే ఇలాంటి స్పైవేర్ వైరస్ లు మన వ్యక్తిగత డేటాతో పాటు మన ప్రతి కదలికలు హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. భారత్ లోని బడా నాయకులు ఈ పెగాసస్ పై విచారణ చెప్పట్టాలని పెద్ద ఎత్తున నిరసనల నేపధ్యంలో సుప్రీమ్ కోర్టు కూడా పెగాసిస్ పై విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే ఇలాంటి కొన్ని హ్యాకింగ్ ల నుండి మన కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్ ని కాపాడుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సి(ఎన్ఎస్ఏ) సంస్థ మొబైల్ వినియోగరులకు సలహాలు చేసింది.

మొబైల్ కి వచ్చే టెక్స్ట్ మెసేజ్ లతో పాటు వాట్స్అప్ లో వచ్చే కొన్ని సైబర్ లింక్ లను క్లిక్ చేయకుండా ఉండటంతో పాటు వారానికి ఒకసారి తమ ఫోన్స్ ని రీబూట్ చేయడం లేదా స్విచ్ ఆఫ్ చేసి కాసేపటికి ఆన్ చేయడం వలన మన ఫోన్ లలో ఉన్న వ్యక్తిగత సమాచారం హ్యాకర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ అధికారి సలహా ఇచ్చాడు. ఇకనైనా సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు రీబూట్ చేయడం వలన పెగాసస్ వంటి పెద్ద హ్యాకింగ్ నుండి కాపాడుకోలేకపోయిన చిన్న చిన్న స్పైవేర్ వంటి వాటి నుండైన మన ఫోన్ లతో పాటు మన ఫొటోస్, డేటా, కాల్ లిస్టులు హ్యాకర్ చేతిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడవచ్చు.

Tags:    

Similar News