Motorola G45 5G: కళ్లు తిరిగే న్యూస్.. రూ.15 వేలకే మోటో కొత్త ఫోన్.. ఫీచర్లు లీక్..!
Motorola G45 5G: మోటో Motorola G45 5G స్మార్ట్‌ఫోన్‌ని ఆగస్ట్ 21న లాంచ్ చేయనుంది. ధర రూ. 15,000గా ఉండే అవకాశం ఉంది.
Motorola G45 5G: ఇండియా టెక్ మార్కెట్‌పై మోటరోలా స్పెషల్ ఫొకస్ చేసింది. ఈ క్రమంలో తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola G45 5G ఆగస్ట్ 21న లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో రానుంది. మోటరోలా ఈ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాండింగ్ పేజ్ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. ఈ పేజ్ ద్వారా ఫోన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Motorola G45 5G ఫోన్‌లో కంపెనీ 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించబోతోంది.ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ 3ని కూడా ఫోన్‌లో అందిస్తోంది. ఫోన్ గరిష్టంగా 8 GB RA+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ప్రాసెసర్‌గా మీరు ఫోన్‌లో Snapdragon 6s Gen 3ని చూడవచ్చు.
ఫోన్‌లో అందించబడిన కెమెరా సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ పేజీలో అందించిన వివరాల ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో సెల్ఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఫోన్‌లో పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంటుంది.OS గురించి మాట్లాడితే ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.
కంపెనీ ఈ ఫోన్‌కి 1 సంవత్సరం పాటు OS అప్‌డేట్‌లను, 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. సౌండ్ కోసం మీరు ఫోన్‌లో డాల్బీ అట్మాస్ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్‌లను పొందుతారు. ఫోన్ IP52 సర్టిఫికేషన్‌తో వస్తుంది. బ్యాక్ ప్యానెల్‌ని వేగన్ లెధర్‌తో డిజైన్ చేశారు. ధర విషయానికి వస్తే లీకైన నివేదిక ప్రకారం ఫోన్‌ను దాదాపు రూ. 15,000 ధరతో విడుదల చేయవచ్చు.