Jio Vs Airtel Vs Vi Vs BSNL: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ రూ.200 లోపు బెస్ట్ ప్లాన్..!
Jio Vs Airtel Vs Vi Vs BSNL: టెలికాం కంపెనీలు యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త ప్లాన్లను ప్రారంభిస్తాయి. అయితే అన్ని కంపెనీలు తక్కువ ధరలో అందించే బెస్ట్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి.
Jio Vs Airtel Vs Vi Vs BSNL: టెలికాం కంపెనీలు యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త ప్లాన్లను ప్రారంభిస్తాయి. అయితే అన్ని కంపెనీలు తక్కువ ధరలో అందించే బెస్ట్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి. దాదాపు ఈ ప్లాన్‌లన్ని రూ. 200 లోపు ఉంటాయి. తక్కువ ధర ప్రీపెయిడ్ ప్లాన్‌లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ నెలవారీ ప్లాన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. దేశంలోని టాప్ 4 టెలికాం కంపెనీలు అంటే Jio, Airtel, Vi, BSNL రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
BSNL రూ.199 ప్లాన్
BSNL రూ.199 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటాను పొందుతారు. దీన్ని బట్టి ఈ ప్లాన్‌లో ఉపయోగించిన మొత్తం డేటా 60GB అవుతుంది. 2GB వినియోగ పరిమితి (FUP) మించిపోయినప్పుడు వేగం 40 Kbpsకి పడిపోతుంది.
ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్
భారతీ ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కింద కస్టమర్‌లు 3 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 300 SMSలను పొందుతారు. అదనంగా ఉచిత HelloTunes, మ్యూజిక్ ఉంటాయి. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో రూ.5 టాక్ టైమ్ కూడా ఇస్తోంది.
వోడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్
Vodafone Idea రూ.199 ప్లాన్ 18 రోజుల సర్వీస్ వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 1GB హై-స్పీడ్ డేటా ఉంటుంది. Vi Movies, TV బేసిక్ బండిల్ కూడా ఉంది. FUP డేటా పరిమితిని మించిపోయినప్పుడు వేగం 64 Kbpsకి పడిపోతుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ల ప్రయోజనాన్ని అందిస్తుంది.
జియో రూ.199 ప్లాన్
జియో రూ.199 ప్లాన్ 23 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ కింద కస్టమర్ రోజుకు 1.5GB డేటాను పొందుతాడు. మొత్తం డేటాను 1.55 GB అందజేస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio TV, Jio Cinema, Jio Cloud వంటి Jio యాప్‌లకు యాక్సెస్ కలిగి ఉంటుంది. FUP డేటా పరిమితిని మించిపోయినప్పుడు వేగం 64 Kbpsకి పడిపోతుంది.