Jio Cheapest Phone Launch: అట్లుంటది జియోతో.. మిడిల్ క్లాస్ ప్రజల కోసం కొత్త ఫోన్ లాంచ్.. ఇన్ని ఫీచర్లు ఎలా..?
Jio Cheapest Phone Launch: జియో Phone Prima 2 4Gని లాంచ్ చేసింది. దీన్ని రూ. .2,799కి కొనుగోలు చేయవచ్చు.
Jio Cheapest Phone Launch: దీపావళికి ముందు వినియోగదారులను సంతోషపెట్టడానికి రిలయన్స్ జియో తన కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. Jio Phone Prima 2 4G పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ గత సంవత్సరం వచ్చిన JioPhone ప్రైమా అప్‌డేట్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. ఈ ఫోన్ అనేక అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఉంటుంది. JioPhone Prima 2 4G వెనుక భాగంలో లెదర్ లాంటి ఫనిషింగ్‌తో సరికొత్త కర్వ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జియో కంపెనీ Jio Phone Prima 2 4Gని లక్స్ బ్లూ కలర్‌లో ప్రవేశపెట్టివంది. ఈ ఫోన్ ధర రూ.2799గా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్ Amazonలో అందుబాటులో ఉంది. అలానే త్వరలో JioMart, Reliance Digital అలాగే ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
JioPhone Prima 2 4G ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ YouTube, Facebook, Google Voice Assistant వంటి ఫీచర్లను అందించే Kai-OS ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. ఇది JioTV, JioCinema, JioSaavn అనేక ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ యాక్స్‌స్ అందిస్తుంది. ఫోన్‌లో JioChat, ఏ యాప్ లేకుండా స్థానిక వీడియో కాలింగ్ కోసం వెనుక, సెల్ఫీ కెమెరా ఉంది.
JioPay సౌండ్ అలర్ట్ సౌకర్యంతో పాటు UPI, స్కాన్ QR కోడ్ పేమెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. Jio ఫోన్ 2000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌లో FM రేడియో కూడా అందించారు. ఈ ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ 320x240 పిక్సెల్ రిజల్యూషన్‌తో అద్భుతమైన 2.4 అంగుళాల QVGA కర్వ్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.
ఫోన్‌లో LED టార్చ్, వెనుక కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Jio ఈ తాజా ఫోన్ 512MB ర్యామ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో వినియోగదారులు దాని మెమరీని 128 GB వరకు పెంచుకోవచ్చు. రౌండ్ ఎడ్జ్ డిజైన్ ఉన్న ఈ ఫోన్ ARM Cortex A53 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.