ISRO-NASA: రాకేశ్ శర్మ తర్వాత.. అంతరిక్షంలోకి వెళ్లనున్న భారతీయుడు ఇతడే..!
ISRO-NASA: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు ఎవరు..? అనగానే ఠక్కున చెప్పే సమాధానం రాకేశ్ శర్మ.
ISRO-NASA: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు ఎవరు..? అనగానే ఠక్కున చెప్పే సమాధానం రాకేశ్ శర్మ. మరి అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో వ్యక్తి ఎవరు అంటే మాత్రం సమాధానం ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు అంతరిక్షంలోకి మరో భారతీయుడు అడుగు పెట్టలేదు. అయితే ఇప్పుడు ఇస్రో సరికొత్త చరిత్రకు నాంది పలకబోతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో... నాసా భారతీయ వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే అంతరిక్షంలోకి ఎవరిని పంపించనున్నామన్న దానిపై భారత అందరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఇండో-యూఎస్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపించేందు ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశారు. వీరిలో ఒకటి భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కాగా, మరో అతను గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్. అయతే తొలి ప్రాధాన్యత శుభాంశు శుక్లాకే ఉంటుంది. ప్రశాంత్ కేవలం బ్యాకప్ అస్ట్రోనాట్ మాత్రమే. ఈ లెక్కన అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండో భారతీయుడు శుభాంశు శుక్లానే అవుతాడన్నమాట.
వీరిద్దరికీ ఇప్పటికే శిక్షణ ప్రారంభించారు. యాక్సియమ్-4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌లో కొన్ని రోజులు గడపనున్నారు. అందులో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలు చేయడంతోపాటు, పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. అయితే ఐఎస్ఎస్ అవతల కూడా అంతరిక్షంలో కూడా కొద్ది గంటలు గడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఎవరీ శుభాంశు..
శుభాంశు శుక్లా విషయానికొస్తే ఈయన 1985, అక్టోబర్ 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విద్యనభ్యసించిన శుక్లా.. 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. ఈయనకు ఫైటర్ కంబాట్ లీడర్‌గా 2000 ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది.
బాలక్షృష్ణన్ విషయానికొస్తే...
బ్యాకప్ ఆస్ట్రోనాట్‌గా ఎంపికైన బాలకృష్ణన్ నాయర్ విషయానికొస్తే.. ఇతను 1976, ఆగస్టు 26న కేరళలోని తిరువాజియాడ్‌లో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అడకాడమీ విద్యనభ్యసించిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు.