Lava Agni 3: డ్యుయల్ డిస్‌ప్లేతో లావా నుంచి అదిరిపోయే ఫోన్.. తక్కువ బడ్జెట్‌లోనే.. ధరెంతంటే?
Lava Agni 3 Price: భారతదేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా.. లో బడ్జెట్‌లో లేటెస్ట్ ఫీచర్లతో కొత్త ఫోన్లను విడుదల చేస్తుంటుంది.
Lava Agni 3 Price: భారతదేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా.. లో బడ్జెట్‌లో లేటెస్ట్ ఫీచర్లతో కొత్త ఫోన్లను విడుదల చేస్తుంటుంది. దీంతో లో బడ్జెట్‌లో ఫోన్లకోసం ఎక్కువ మంది ఈ కంపెనీ వైపే చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. లావా అగ్ని 3 పేరుతో వచ్చిన కొత్త 5జీ ఫోన్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది.
గతేడాది లాంచ్ చేసిన అగ్ని 2కి సక్సెసర్‌గా కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, AMOLED డిస్‌ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
లావా అగ్ని 3 ధర..
లావా ఈ ఫోన్‌ను రెండు కాన్ఫిగరేషన్‌లలో విడుదల చేసింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999లుగా పేర్కొంది. అయితే, కంపెనీ ఈ వేరియంట్‌తో ఛార్జర్‌ను అందించదు. మీరు దీన్ని ఛార్జర్‌తో కొనుగోలు చేయాలనుకుంటే రూ. 2,000లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్‌తో పాటు 66W ఛార్జర్ అందుబాటులో ఉంటుంది.
అయితే, ఈ ఫోన్ మరో వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999లుగా కంపెనీ పేర్కొంది. దీనితో మీకు ఛార్జర్ లభిస్తుంది. 499 రూపాయలకు అమెజాన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. దీని సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ప్రీ-ఆర్డర్ చేసిన వినియోగదారులు అక్టోబర్ 8 నుంచి కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
లావా అగ్ని 3లో డ్యూయల్ డిస్‌ప్లే పొందుతారు. ఫోన్ 6.78-అంగుళాల AMOLED ప్రధాన డిస్‌ప్లే, 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300X ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో మీరు 8GB RAM, 256GB స్టోరేజ్ పొందుతారు.
ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 8MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు భాగంలో, కంపెనీ 16MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందించింది. ఇది 66W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో Android 14 అందుబాటులో ఉంది. అయితే, కంపెనీ దీనికి 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తోపాటు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.