Realme GT 7 Pro: రియల్‌మీ నుంచి కళ్లు చెదిరే ఫోన్.. వైరల్ అవుతోన్న ఫీచర్స్..!
Realme GT 7 Pro: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది.
Realme GT 7 Pro: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ జీటీ 7 ప్రో (Realme GT 7 Pro) పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. దీంతో టెక్ లవర్స్ ఈ ఫోన్ విడుదల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ ఫోన్ విడుదలకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.
ఈ ఏడాది చివరిలో రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా చైనీస్ టిప్‌స్టర్ రియల్‌మీ జీటీ 7 ప్రోకు సంబంధించిన ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్‌మీ జీటీ 7ప్రో స్మార్ట్ ఫోన్‌లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన బీఓఈ ఎక్స్2 ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1.5 కే రిజల్యూషన్ ఈ స్క్రన్ సొంతం. అలాగే 120 హెచ్‌జెడ్ రిఫ్రెస్ రేట్‌కు ఈ స్క్రీన్ సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌కు రైట్ సైడ్ పవర్‌కీ, వాల్యూమ్ కీలను అందిచనున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 8.5 మిమీ మందంతో ఉంటుందని టిప్‌స్టర్స్ తెలిపారు. ఇక ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందిచనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌ను అదించనున్నారని సమాచారం. ఇక ఈ ఫోన్ రియల్‌మీ యూఐ 6 ఆధారిత ఆండ్రాయిడ్ 15 పై పని చేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 6,000mAh వటి పవర్ ఫుల్ బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం.
ఇక కెమెరా పరంగా చూస్తే ఇందులో.. 50 ఎంపీ OIS ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించనున్నారు. అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 10x హైబ్రిడ్ జూమ్, 120x వరకు 50MP LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో, డిజిటల్ జూమ్ ఫోటోలను తీయవచ్చని తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. సెక్యూరిటీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ల ఇవ్వనున్నారు. అలాగే IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టంట్ రేటింగ్‌తో రానుందని సమాచారం.