Apple Diwali Sale 2024: యాపిల్‌ లవర్స్‌ వెంటనే త్వరపడండి.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

Apple Diwali Sale 2024: దేశంలో పండుగల సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో అన్ని దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-03 06:22 GMT

Apple Diwali Sale 2024

Apple Diwali Sale 2024: దేశంలో పండుగల సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో అన్ని దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాషన్‌ మొదలు ఎలక్ట్రానిక్స్‌ వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్ కూడా వచ్చి చేరింది. యాపిల్‌ దీవాళి సేల్స్‌కు సంబంధించి కొన్ని డీల్స్‌ను ముందస్తుగానే ప్రకటించింది. యాపిల్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్‌ టైమ్‌గా చెప్పొచ్చు. ఇంతకీ యాపిల్ అందిస్తోన్న ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి డిస్కౌంట్స్‌ లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సేల్‌లో భాగగంగా అన్ని రకాల యాపిల్‌ ప్రొడక్ట్స్‌పై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌ లభించనుంది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యాక్సిస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి ఈ క్యాష్‌ బ్యాక్‌ లభించనుంది. అలాగే నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను సైతం అందించనున్నారు. ఇక ఈ సేల్‌లో ఐఫోన్స్‌పై మంచి డీల్స్‌ను అందిస్తోంది యాపిల్‌.

ముఖ్యంగా ఐఫోన్‌ 16 ప్రో లేదా ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లపై రూ. 5000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌ ఫోన్‌లపై రూ. 5000 వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. ఇక ఐఫోన్‌14, ఐఫోన్‌ 14 ప్లస్ ఫోన్‌లపై రూ. 3000 వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ ఎస్‌ ఫోన్‌పై రూ. 2 వేల తగ్గింపు అందిస్తున్నారు.

యాపిల్‌కు చెందిన మ్యాక్‌బుక్‌పై కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఎమ్‌3 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్‌లపై రూ. 10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. ఇక మ్యాక్‌ బ్యాక్‌ 14 ఇంచెస్‌, 16 ఇంచెస్‌ వాటిపై ఏకంగా రూ. 8 వేల డిస్కౌంట్స్‌ లబిస్తోంది. ఇక ఐమ్యాక్‌ 24 ఇంచెస్‌పై రూ. 10 వేల క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నారు. ఐప్యాడ్‌పై కూడా యాపిల్ మంచి ఆఫర్లను అందిస్తోంది. సేల్‌లో భాగంగా ఐప్యాడ్‌ 11 ఇంచెస్‌, 13 ఇంచెస్‌పై రూ. 6 వేల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది అలాగే 11 ఇంచెస్‌, 13 ఇంచెస్‌పై రూ. 4 వేల డిస్కౌంట్ అందించనున్నారు.

ఇక ఎయిర్‌పాడ్స్‌ కూడా మంచి తగ్గింపు ధరలు అందిస్తున్నారు. వీటిపై రూ. 2 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నారు. ఇక ఎయిర్‌పాడ్స్‌ 4పై రూ. 1500 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. యాపిల్ ప్రీమియం ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ హెడ్‌ఫోన్స్‌పై రూ. 4వేల క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నారు.

Tags:    

Similar News