OnePlus: వన్‌ప్లస్ కంపెనీకి బిగ్ షాక్.. ఆ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎఫెక్ట్.. సేల్స్ బంద్..!
OnePlus: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) ఫోన్లు మనదేశంలోనూ బాగా పాపులర్ అయ్యాయి.
OnePlus: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) ఫోన్లు మనదేశంలోనూ బాగా పాపులర్ అయ్యాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వన్‌ప్లస్ సంస్థకు జర్మనీలో అతిపెద్ద మార్కెట్ ఉంది. తాజాగా ఇక్కడ సంస్థకు మరోసారి కష్టాలు ఎదురయ్యాయి. జనవరి 2024 తర్వాత మరోసారి జర్మనీలో వన్‌ప్లస్ అమ్మకాలను నిలిపివేసిందంట. వైర్‌లెస్ టెక్నాలజీ రీసెర్చ్, డెవలప్‌మెంట్ కంపెనీ ఇంటర్‌డిజిటల్‌తో చట్టపరమైన వివాదం నెలకొంది.
దీంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ వివాదం 5G, మొబైల్ టెక్నాలజీలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా పేటెంట్స్‌కు సంబంధించిన హక్కుల కోసం వివాదం జరుగుతోందంట. 5G, మొబైల్ టెక్నాలజీ పేటెంట్ల రూల్స్‌ను వన్‌ప్లస్ సంస్థ బ్రేక్ చేస్తోందని ఇంటర్‌డిజిటల్ కంపెనీ విమర్శలు గుప్పించింది.
ఏయే ప్రొడక్ట్‌లపై ప్రభావం?
5జీలో తన పేటెంట్‌ని ఓన్‌ప్లస్ ఉల్లంఘించిందని ఇంటర్‌డిజిట్ ఆరోపణలు చేసింది. నిషేధం కారణంగా ఓన్‌ప్లాస్ ఓపెన్, ఓన్‌ప్లాస్ 12, ఓన్ ప్లస్ 11 ఫోన్‌ల విక్రయాన్ని ఆన్‌లైన్ స్టోర్ల నుంచి తొలగించారు. ప్రస్తుతం జర్మనీలో ఓన్‌ప్లాస్ ప్యాడ్ 2, ఓన్‌ప్లస్ వాచ్ 2 మాత్రమే ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు ఉత్పత్తులకు సెల్యులార్ మద్దతు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జర్మనీలో వన్‌ప్లస్ సంస్థకు ఇదే మొదటి వివాదం కాదు. ఇంతకు ముందు అంటే, 2020లో ఒప్పో, వన్‌ప్లస్‌లకు సంబంధించిన ఇదే విధమైన పేటెంట్ వివాదం చోటు చేసుకుంది. మన్‌హీమ్ ప్రాంతీయ న్యాయస్థానం నోకియాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇది రెండేళ్లపాటు అమ్మకాల నిషేధానికి దారితీసింది. ఆ విషయాన్ని పరిష్కరించిన తర్వాత వన్‌ప్లస్ ఈ సంవత్సరం ప్రారంభంలో జర్మన్ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది. ఇప్పుడు ఇంటర్‌డిజిటల్‌తో ఈ కొత్త సవాలును ఎదుర్కోంటుంది.
వన్‌ప్లస్, ఇంటర్‌డిజిటల్‌తో చర్చలను కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమస్యను సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం ఆశిస్తున్నట్లు తెలిపింది. జర్మనీలో తాత్కాలికంగా ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఉత్పత్తులు, సేవల కోసం ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తానని హామీ ఇస్తూ యూరోపియన్ మార్కెట్ పట్ల తన నిబద్ధతను కంపెనీ పునరుద్ఘాటించింది.