Oneplus 13: అధికారికంగా వచ్చేసిన వన్‌ప్లస్‌13 లుక్‌.. ఫీచర్స్‌ కెవ్వు కేక అంతే..!

OnePlus 13 Preview: టెక్‌ లవర్స్‌ ఎప్పుటి నుంచో ఆసక్తికగా ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్‌ వన్‌ప్లస్ 13.

Update: 2024-10-04 06:06 GMT

Oneplus 13

OnePlus 13 Preview: టెక్‌ లవర్స్‌ ఎప్పుటి నుంచో ఆసక్తికగా ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్‌ Oneplus 13. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ కంపెనీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫోన్‌లన్నీ యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైంది. మొదట ఈ ఫోన్‌ వచ్చే ఏడాది జనవరిలో లాంచ్‌ అవుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా వన్‌ప్లస్ 13 (Oneplus 13) ఫోన్‌ను చైనాలో ఈ నెల చివరిలో లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి నెట్టింట కొన్ని ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. అలాగే వన్‌ప్లస్‌ 13కి సంబంధించిన లుక్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్ల విషయానికొస్త ఈస్మార్ట్ ఫోన్‌లో 24 జీబీ LPDDR5X ర్యామ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక స్టోరేజీ విషయానికొస్తే 1టీబీ వరకు స్టోరేజ్‌ను అందించనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెటప్‌ లేదా మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను పనిచేయనుందని తెలుస్తోంది. అలాగే ఇందులో ​ 6.82 ఇంచెస్తో కూడిన ఎల్టిపిఓ బీఓఈ ఎక్స్ 2 మైక్రో-కర్వ్డ్ ఓఎల్​ఈడీ డిస్​ప్లేని 2 కే రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్‌ను ఇవ్వనున్నారని సమాచారం.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో (Smartphone) సోనీ ఎల్వైటీ 808 సెన్సార్​తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సోనీ ఎల్వైటీ 600 సెన్సార్​తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్​తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 100 వాట్‌ వైర్డ్‌, 50 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫీచర్లకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

Tags:    

Similar News