WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. అలాంటి ఫొటోలకు చెక్‌ పెట్టేలా..!

WhatsApp: మారిన టెక్నాలజీతో పాటు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ పేరుతో నకిలీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Update: 2024-12-28 05:13 GMT

WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. అలాంటి ఫొటోలకు చెక్‌ పెట్టేలా..!

WhatsApp: మారిన టెక్నాలజీతో పాటు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ పేరుతో నకిలీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. సాంకేతికతను అడ్డు పెట్టుకొని కొందరు ఫేక్‌ ఫొటోలను క్రియేట్ చేస్తూ సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. దీంతో ఏది అసలు ఫొటో, ఏదో నకిలీ ఫొటోనో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టెక్‌ కంపెనీలు రకరకాల సేఫ్టీ టూల్స్‌ను తీసుకొస్తున్నాయి. వీటి సహాయంతో అసలు, నకిలీ ఫొటోల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ సైతం కొత్త పీచర్‌ను తీసుకొస్తోంది. అయితే ఈ ఫీచర్‌ కేవలం వాట్సాప్‌ వెబ్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో గూగుల్‌లో సెర్చ్‌ చేసిన ఫొటోలు లేదా మీకు వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలు నిజమైనవా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌పై పనులు జరుగుతున్నాయి. టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డీప్‌ టెక్నాలజీతో రూపొందించిన ఫొటోలను ఈ ఫీచర్‌తో ఇట్టే గుర్తించవచ్చని చెబుతున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు మనకు ఏదైనా ఫొటోపై అనుమానం వస్తే దానిని డౌన్‌లోడ్ చేసుకొని రివర్స్‌ సెర్చ్‌ కోసం గూగుల్‌లో అప్‌లోడ్ చేసేవాళ్లం.

గూగుల్ సెర్చ్‌ బాక్స్‌లో ఇమేజ్‌ను పేస్ట్ చేయడం ద్వారా సదరు ఫొటో సోర్స్ ఏంటన్న విషయాన్ని తెలుసుకునే వాళ్లం. కానీ ఇకపై ఆ అవసరం లేకుండానే వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఇకపై నేరుగా వాట్సాప్‌ యాప్‌లోనే ఫొటో ఒరిజినల్ సోర్స్‌ను తెలుసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Tags:    

Similar News