iPhone 17 Mobile Features: ఐఫోన్ 17 ఫీచర్స్ లీక్.. అదిరిపోయే అప్‌డేట్స్..
iPhone 17 Mobile Features: ఐఫోన్ 16.. ఈ సెప్టెంబర్ 9న మార్కెట్లోకి లాంచ్ కానున్న యాపిల్ ఫోన్ ఇది. గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ ఐఫోన్ 16 గురించే బోలెడన్ని కథనాలు. ఐఫోన్ 16 ఫీచర్స్ ఎలా ఉండనున్నాయి, ఈసారి ఎలాంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి, డిజైన్ ఏంటి ? లెన్స్ ఏంటి ? స్క్రీన్, డిస్‌ప్లే... అబ్బో ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో అప్‌డేట్స్.. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 17 గురించి కూడా మాదగ్గర ఓ కొత్త అప్‌డేట్ ఉంది.
ఏంటి ఇంకా మార్కెట్లోకి ఐఫోన్ 16 రానేలేదు.. అప్పుడే ఐఫోన్ 17 గురించి లీకులా అని అవాక్కవుతున్నారా ? యస్.. ఎవరి రియాక్షన్ ఎలా ఉన్నా.. ఐఫోన్ 17 కి సంబంధించిన లీకేజెస్, అప్‌డేట్స్ కూడా అప్పుడే రావడం మొదలయ్యాయనేది మాత్రం వాస్తవం.
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే.. ఎప్పుడూ టాపే. మార్కెట్లోకి కొత్త మోడల్ ఇంకా లాంచ్ కాకముందు నుండే, తరువాత రాబోయే ఐఫోన్‌పై ఇంటర్నెట్లో పెద్ద డిస్కషన్ నడుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. అంతేకాదు.. ప్రతీ ఏడాది ఐఫోన్ లాంచింగ్ ఈవెంట్ లైవ్ ప్రసారం కోసం ప్రపంచవ్యాప్తంగా వేచిచూసే జనం కూడా ఉన్నారు. ఐఫోన్‌కి ఉండే క్రేజ్ అలాంటిది. ప్రస్తుతం ఐఫోన్ లవర్స్ ఎదురుచూస్తున్న మూమెంట్ ఏదైనా ఉందా అంటే అది ఐఫోన్ 16 లాంచింగ్. ఈ సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 లాంచ్ అవుతుంది. అందుకే గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఐఫోన్ 16 గురించి బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. ఇది ఎప్పుడూ జరిగేదే. కానీ ఈసారి ఏకంగా ఐఫోన్ 17 గురించి కూడా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రావడం మొదలైంది.
తాజాగా డిజిట్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఐఫోన్ 17 మొబైల్లో వస్తోన్న కొత్త అప్‌డేట్ ఏంటంటే.. వచ్చే ఏడాది లాంచ్ కానున్న ఐఫోన్ లో 12GB RAM ఉండనుందని తెలుస్తోంది. ఈ సెప్టెంబర్ 9న లాంచ్ కానున్న ఐఫోన్ 16 లో 8GB RAM వరకే ఉండనుందని ఇప్పటికే అప్‌డేట్స్ వచ్చాయి. కానీ ఐఫోన్ 17 మాత్రం 12GB ర్యామ్‌తో రానుందని సమాచారం. చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో మొబైల్ ఫోన్ చిప్ ఎక్స్‌పర్ట్ అనే యూజర్ ఈ డీటేల్స్ లీక్ చేసినట్లుగా డిజిట్ కథనం పేర్కొంది.
ఐఫోన్ 17 మరింత స్లిమ్ అవనుందని.. అందుకే మరో ఏడాది ఆగి ఐఫోన్ 17 కొనుక్కోవడం బెటర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అలా అయితే 12GB ర్యామ్ కూడా యాడ్ అవుతుంది కదా అనేది వారి అభిప్రాయం.
ర్యామ్ పెరగడం అంటే.. ఆ స్మార్ట్ ఫోన్ పర్‌ఫార్మెన్స్ ఇంకొంత మెరుగ్గా పనిచేయనుందని అర్థం. ఇప్పటికే ఐఫోన్ అనేది ఒక స్పీడ్ వర్కింగ్ డివైజ్... మరి దీని ర్యామ్ ఇంకా పెరిగితే ఆ స్పీడ్ ఇంకే స్థాయిలో ఉంటుందంటున్నారు స్మార్ట్‌ఫోన్ యూజర్స్. ఐఫోన్‌తో వీడియోలు షూట్ చేసి, అందులోనే ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి ఈ ఐఫోన్ 17 మోడల్ బాగా కలిసొచ్చే అంశం కానుందేమోననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.