iPhone 16 All Features: ఆకట్టుకునే ఫీచర్లతో ఐఫోన్ 16.. ఆ ఫీచర్ మరీ ఇంట్రెస్టింగ్

Update: 2024-09-09 16:22 GMT

iPhone 16 Features Explanied: యాపిల్ ఐఫోన్ 16 లాంచింగ్ టైమ్ రానే వచ్చింది. ఎప్పటి నుండో ఐఫోన్ లవర్స్ ఎదురుచూస్తోన్న క్షణం ఇది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు యాపిల్ కంపెనీ ఇట్స్ గ్లోటైమ్ (“It's Glowtime”) పేరుతో నిర్వహించనున్న ఈవెంట్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా యాపిల్ తమ కంపెనీ నుండి వస్తోన్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్స్ ఫీచర్స్ గురించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు. కాకపోతే స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి, లాంచింగ్స్ కంటే ముందుగానే లేటెస్ట్ అప్‌డేట్స్ అందించే టెక్ వీరులు మాత్రం ఎప్పటికప్పుడు ఐఫోన్ 16 ఫీచర్స్ గురించి అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

ప్రస్తుతానికి ఇంటర్నెట్ పరిశోధనలో గమనించిన అప్‌డేట్స్ ప్రకారం ఐఫోన్ 16 ఫీచర్స్, ఇండియాలో ఆ ఫోన్ ధరలు ఎలా ఉండనున్నాయంటే..

ఈసారి భారత్‌లో ధర తగ్గే అవకాశం

ఎక్స్ వేదికపై యాపిల్ హబ్ అనే పేరుతో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్‌డేట్స్ అందించే ఒక యాక్టివ్ యూజర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది తరహాలోనే 128GB వేరియంట్ ఐఫోన్ 16 కి 799 అమెరికన్ డాలర్లు, అలాగే ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌కి 899 డాలర్లు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీలో రూ. 67,000 నుండి 75,000 వరకు ఉండే అవకాశం ఉంది. గతేడాది వచ్చిన ఐఫోన్ 15 ధర రూ. 79,990 గా ఉండింది. అయితే, ఈ ఏడాది ఐఫోన్ ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే.. మొబైల్ ఫోన్లపై ఎక్సైజ్ డ్యూటీ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవలే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఐఫోన్ 16 ధరపై కూడా ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఐఫోన్ 16 డిజైన్:

ఐఫోన్ 16 డిజైన్‌లో యాపిల్ పలు మార్పులు తీసుకొస్తున్నట్లు గత కొద్దిరోజులుగా కొన్ని రూమర్స్ చల్‌చల్ చేస్తున్నాయి. ఐఫోన్ X, ఐఫోన్ 12 తరహాలో వర్టికల్ కెమెరా లేఔట్ విధానంలో ఐఫోన్ 16 డిజైన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 15 ప్రో మోడల్‌కి వచ్చినట్లుగానే మ్యూట్ బటన్ స్థానంలో యాక్షన్ బటన్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోందని రూమర్స్ చెబుతున్నాయి. అంతేకాకుండా క్యాప్చర్ అనే కొత్త బటన్‌తో వీడియో రికార్డింగ్ ఫీచర్స్ మరింత మెరుగుపర్చనున్నట్లు తెలుస్తోంది. అదే కానీ నిజమైతే.. ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి, కంటెంట్ క్రియేటర్స్‌కి ఇది ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

మింగ్ చి కువో అనే అనలిస్ట్ చెబుతున్న వివరాల ప్రకారం ఈసారి ఐఫోన్ 16 బ్లాక్, గ్రీన్, పింక్, బ్లూ, వైట్ కలర్స్‌లో వచ్చే అవకాశం ఉంది.

ఐఫోన్ 16 ప్రాసెసర్:

ఏఐ టాస్క్‌లని కూడా నేరుగా డివైజ్ పైనే చక్కగా పర్‌ఫామ్ చేసేలా ఈసారి ఐఫోన్ 16 లో ఐడెంటికల్ A18 చిప్‌సెట్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. GPU పర్‌ఫార్మెన్స్, క్లాక్ స్పీడ్ పనితీరులోనూ మెరుగుదల ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక RAM విషయానికొస్తే.. గతంలో ఉన్న 6GB RAM నుండి 8GB RAM కి పెంచుతున్నట్లుగా వార్తా కథనాలు చెబుతున్నాయి.

ఐఫోన్ 16 డిస్‌ప్లే:

ఎప్పటిలాగే ఈసారి కూడా యాపిల్ ఐఫోన్ 16 విషయంలో ఎలాంటి మార్పు లేకుండా అదే 6.1 అంగుళాలు , 6.7 అంగుళాల ఓఎల్ఈడి స్క్రీన్‌ని ఉపయోగించే అవకాశం ఉందంటున్నారు. కాకపోతే ఈసారి బ్రైట్నెస్ పెంచి బ్యాటరీ పవర్ వినియోగాన్ని కొంతమేరకు తగ్గించేలా ఐఫోన్ 16 డిస్‌ప్లేలో మైక్రో లెన్స్ టెక్నాలజీ ఉపయోగించే అవకాశం లేకపోలేదని మ్యాక్‌రూమర్స్ అనే ఆన్‌లైన్ పోర్టల్ అభిప్రాయపడింది.

ఐఫోన్ 16 కెమెరా ఫీచర్స్:

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ఇదే. మీలో చాలామంది ఎదురుచూస్తోన్న అంశం ఐఫోన్ 16 కెమెరా ఫీచర్స్ గురించే కదా!! యస్.. ఇందులో కెమెరా విషయానికొస్తే.. గతేడాది తరహాలోనే సేమ్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉందని యాపిల్ ఇన్‌సైడర్ న్యూస్ రిపోర్ట్ పేర్కొంది. ఈసారి ఐఫోన్‌లో 48MP ప్రైమరీ షూటర్,

f/1.6 అపర్చర్, 2x ఆప్టికల్ టెలిఫోటో జూమ్, 0.5 రెట్లతో ఫోటోలు తీసేలా ఒక అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉండనున్నాయని అంచనాలు చెబుతున్నాయి. ఇందులోనూ చెప్పుకోదగిన మరో ఆసక్తికరమైన అప్‌గ్రేడ్ ఏంటంటే... అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో గతంలో f/2.4 అపర్చర్ కాకుండా ఈసారి f/2.2 అపర్చర్‌కి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. తక్కువ లైటింగ్‌లోనూ ఫోటోలు స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. లో లైటింగ్ ఫోటోగ్రఫీలో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పుకోవాల్సిన మరో అంశం ఏంటంటే.. ఈసారి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌లో మ్యాక్రో ఫోటోగ్రఫీ సపోర్ట్ కూడా లభించనున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 16 కి సంబంధించిన అన్ని వివరాలను యాపిల్ కంపెనీ It's Glowtime ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించనుంది. యాపిల్ కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్ యాపిల్.కామ్, యాపిల్ టీవీ యాప్, యాపిల్ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లలో ఈ ఇట్స్ గ్లోటైమ్ లైవ్ ఈవెంట్‌ని ప్రసారం చేయనుంది.

Tags:    

Similar News