Infinix Hot 50: రూ. 10వేలలో కళ్లు చెదిరే ఫీచర్స్.. మార్కెట్లోకి మరో కొత్త ఫోన్..!
ఇన్‌ఫినిక్స్ హాట్ 50 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అందించారు.
Infinix Hot 50 5G Review: మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. చైనాకు చెందిన దిగ్గజ కంపెనీలు రూ. 10 వేల లోపు మంచి ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ హాట్ 50 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌ఫినిక్స్ హాట్ 50 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 1600 x 720 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం. ఇక ఈ ఫోన్‌లో ఐపీ54 డస్ట్, స్ల్పాష్ రెసిస్టన్స్ ఈ ఫోన్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఇక 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీగల బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 9999గా నిర్ణయించారు. అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 10,999గా ఉంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.