Amazon Sale: ట్యాబ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఇదే కరెక్ట్ టైమ్, భారీ డిస్కౌంట్స్..!
ఈ కామర్స్ సంస్థలు సైతం భారీగా ఆఫర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ట్యాబ్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది.
Amazon Sale: స్మార్ట్‌ఫోన్‌లతో సమానంగా ట్యాబ్‌లకు ఆదరణ పెరుగుతోంది. భారీగా ధరలు తగ్గుముఖం పట్టడం. అధునాతన ఫీచర్లతో కూడిన ట్యాబ్స్‌ను తీసుకొస్తుండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ కామర్స్ సంస్థలు సైతం భారీగా ఆఫర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ట్యాబ్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ భాగంగా పలు బ్రాండ్‌లకు చెందిన ట్యాబ్స్‌పై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా లభిస్తోన్న అలాంటి కొన్ని బెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* సేల్‌లో భాగంగా మంచి డిస్కౌంట్ లభిస్తోన్న ట్యాబ్లెట్‌లో హానర్ ప్యాడ్ ఎక్స్ 9 ఒకటి. ఈ ట్యాబ్లెట్‌పై అమెజాన్‌లో 42 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ట్యాబ్ ధర రూ. 14,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే హానర్ ప్యాడ్ ఎక్స్9ని 7జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 11.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్ 2కే డిస్‌ప్లే దీని సొంతం. 6 స్పీకర్లతో కూడిన ఈ ట్యాబ్‌లో 100శాతం ఎస్ఆర్జీబీ టెక్నాలజీతో కంటికి మంచి సంరక్షణతో విజువల్స్ ను అందిచారు.
* రూ. 20వేలలో లభిస్తోన్న మరో బెస్ట్ ట్యాబ్ రెడ్‌మీ ప్యాడ్ ఎస్‌ఈ. 25 శాతం డిస్కౌంట్‌తో ఈ ట్యాబ్ రూ. 14,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేను అందించారు. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. డాల్బీ సపోర్టుతో కూడిన స్పీకర్స్ అందించారు.
* లెనోవో ట్యాబ్ యోగా 11 ట్యాబ్‌పై ఏకంగా 63 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 14,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ట్యాబ్‌లో డాల్బీ విజన్‌ను అందించారు. క్రిస్టల్ క్లియర్ 2కే ఎల్సీడీ డిస్ ప్లే ఈ ట్యాబ్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో.. 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
* తక్కువ ధరకు లభిస్తోన్న ట్యాబ్స్‌లో రియల్ మీ ప్యాడ్2 ఒకటి. దీనిపై అమెజాన్‌లో 25 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 79,950కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2కే డిస్ ప్లే 120హెర్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. మీడియా టెక్ హీలియో జీ99 చిప్ సెట్, సీపీయూ 6ఎన్ఎం ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది. ధర విషయానికొస్తే రూ. 17, 950కి లభిస్తోంది.
* హానర్ ప్యాడ్8 ట్యాబ్ తక్కువ ధరకు లభిస్తోంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే 11.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 2కే డిస్‌ప్లేను ఇచ్చారు. ఎస్‌ఆర్జీబీ స్క్రీన్ టెక్నాలజీ ఈ ట్యాబ్ సొంతం. ఈ ట్యాబ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఏకంగా ఆరు సరౌండ్ స్పీకర్స్‌ను అందించారు.