HMD Fusion: రంగంలోకి దిగిన నోకియా.. HMD నుంచి బాబులాంటి ఫోన్ లాంచ్.. ఫీచర్లు అరాచకం..!
HMD Fusion: హెచ్‌ఎమ్‌డీ MD IFA 2024లో కొత్త స్మార్ట్‌ఫోన్ HMD Fusionను పరిచయం చేసింది. దీని ధర దాదాపు రూ. 24,000గా ఉండే అవకాశం ఉంది.
HMD Fusion: నోకియా బ్రాండిగ్ కంపెనీ హెచ్‌ఎమ్‌డీ MD IFA 2024లో కొత్త స్మార్ట్‌ఫోన్ HMD Fusionను పరిచయం చేసింది. స్మార్ట్ ఔట్‌ఫిట్టర్స్ మార్చుకోగలిగిన కవర్‌లతో అటాచ్ చేయవచ్చు. ఇది ఫోన్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను రీప్లేస్ చేయగలదు. HMD Fusion స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో 8GB RAMని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. HMD ఫ్యూజన్ మాడ్యులర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది రిపేర్ చేయడం సులభం చేస్తుంది. HMD ఫ్యూజన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
HMD ఫ్యూజన్ త్వరలో UKలో EUR 249 (దాదాపు రూ. 24,000) ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది. అలానే దీనితో పాటు వైర్‌లెస్, గేమింగ్ స్మార్ట్ అవుట్‌ఫిట్‌లు ఈ సంవత్సరం చివర్లో అందుబాటులో ఉంటాయి. ఇది 720 x 1,612 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 600 nits పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. రెండు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాలు సేఫ్టీ అప్‌డేట్‌లను కంపెనీ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ఉపయోగించి 1TB వరకు పెంచుకోవచ్చు. HMD ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ 65 గంటల పాటు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉంటాయి.
కెమెరా సెటప్ గురించి మాట్లాడితే HMD ఫ్యూజన్ వెనుక భాగంలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.2, GPS/AGPS, GLONASS, BDS, గెలీలియో, OTG, USB టైప్-సి పోర్ట్ మరియు వైఫై ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. iFixit కిట్‌ని ఉపయోగించే వినియోగదారులు కొత్త Fusion బ్యాటరీ, ఇతర భాగాలను సులభంగా రీప్లేస్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ IP52 రేటింగ్‌తో వస్తుంది.